Home / తాజా వార్తలు
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న50.50 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం ఈరోజు 51.60 అడుగులకు చేరింది. కాగా భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 13 లక్షల 49 వేల 465 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు.
భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియామకాన్ని ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు 26తో ముగియనుంది. ఆయన స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు.
దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ అంపైరింగ్ దిగ్గజం రూడీ కోర్జెన్ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో రూడీ ప్రాణాలు విడిచారు. రూడీ ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. నెల్సన్ మండేలా బే ఏరియాలో నివసించే రూడీ కోర్జెన్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనేందుకు కేప్ టౌన్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
శ్రీలంక ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేట్లు లేవు. పెట్రోల్ కొరత, ఆహార కొరత, విద్యుత్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు తాజాగా శ్రీలంక ప్రజల నెత్తిన కరెంటు చార్జీలు పిడుగు పడింది. సిలోన్ ఎలక్ర్టిసిటి బోర్డు విద్యుత్ టారిఫ్‌ను ఏకంగా 264 శాతం పెంచేసింది.
బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీతో అసౌకర్యంగా ఉండటం వల్ల తెగతెంపులు చేసుకుని ఇతర పార్టీల పొత్తుతో నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని అన్నారు. ఒకప్పడు ప్రశాంత్ కిశోర్ నితీష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడు.
విప్లవకవి వరవరరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. బీమా కోరేగావ్ కేసులో నిందితుడుగా ఉన్న వరవరరావుకు అనారోగ్య కారణాల వల్ల బెయిల్ మంజూరు చేసింది. ఇచ్చిన బెయిల్‌ను ఎలాంటి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు బెంచ్ జడ్జి యుయు లలిత్ ఆదేశించారు.
నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఈ ముఠా దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైసపీ ఎంపీ మాధవ్ వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.ఇది ఫేక్ వీడియో అని మీడియా కు తెలిపారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేసారు. అది ఫేక్ వీడియో అని ఎస్పీ ఎలా తేల్చారో చెప్పాలని ప్రశ్నించారు.
హిందూపురం వైసీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా సమావేశం నిర్వహించారు. వీడియో కాల్ వ్యవహారంపై ఎంపీ మాధవ్ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఈనెల 4న కేసు నమోదు