Home / తాజా వార్తలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొంది. సోమవారం నాడు ఐదవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక మిగిలింది కేవలం రెండు విడతల పోలింగ్ మాత్రమే. ఇక అందరి దృష్టి స్టాక్ మార్కెట్లపై పడింది. ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఐదవ విడత లోకసభ పోలింగ్ జరుగుతోంది. ముంబైలో పోలింగ్ సందర్బంగా బాలీవుడ్ ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో హ్రితిక్ రోషన్ ఆయన కుటుంబసభ్యులున్నారు. ఓటు వేసి వచ్చిన తర్వాత ఆయన కొంత సేపు మీడియాతో ముచ్చటించారు
భర్త కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగి ని సస్పెండ్ చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది .ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భార్య లావణ్య దేవిని సస్పెండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు ,పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తు పూర్తిచేసింది .సోమవారం మధ్యాన్నం డీజీపీని కలిసి సిట్ చీఫ్ బ్రీజ్ లాల్ తమ నివేదికను సమర్పించారు .
లీస్ స్టేషన్ లో విచారణలో వున్నఅనుచరులను విడిపించుకుని వెళ్లిన సంఘటనలో ఇప్పటికే టీడీపీకి చెందిన దెందులూరు మాజీ చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే .ఈ సంఘటన మరువకముందే ఇలాంటి సంఘటన మరొకటి ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అజర్ బైజాన్‌కు వెళ్లి వస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. నిన్న వాతావరణ అనుకూలించక హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి నర్సులు ఆపరేషన్ చేయడంతో పుట్టిన బిడ్డ అస్వస్దతకు గురై మరణించింది. దీనితో బాధితులు ఆందోళనకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలివి.
ఏపీలో ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి .తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయినది .ఉమ్మడి చిత్తూర్ జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి రేణిగుంట మండలం వెద్దలచెరువు వద్ద ఉదయం సంఘటన చోటు చేసుకుంది బెంగుళూరు నుండి అమలాపురం వెళుతున్న బస్సుకు వెద్దల చెరువు ఉగాది హోటల్ వద్ద ప్రమాదం జరిగినది. బస్సు టైర్ పగిలి నిప్పులు రావడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారీ చేసి నిరుద్యోగ యువతి, యువకులకు అమ్ముతున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మహేశ్వరం SOT, చైతన్య పురి పోలీసుల దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో మొత్తం 7మంది ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 3 నుంచి చినుకులు మొదలయ్యాయి. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండి మైసమ్మ , పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.