Home / తాజా వార్తలు
అమెరికాలో తెలుగు తేజం మెరిసింది . కాలిపోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ బాడిగ జయ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు.
ఇస్లామిక్ తీవ్రవాదానికి ఏపీ లోని ముస్లిం యువత కూడా లోనవుతుంది .గతంలో కూడా చాలా సంఘటనలు రుజువు చేసాయి . అరెస్టులు కూడా జరిగాయి . తాజాగా ఇలాంటి డే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోటుచేసుకుంది .
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆఫ్ట్రాల్ నువ్వేంత్ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే.. నీకు ఆ పదవి వచ్చిందని ధ్వజమెత్తారు. పదవి నీ సొంతం కాదు, నీ జాగీరు కాదు.. అది ప్రజల హక్కు అని విమర్శించారు.
హైదరాబాద్‌లో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఉమామహేశ్వరరావుపై ఆరోపణ రావడంతో.. అశోక్ నగర్‌లోని అతని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
డ్రంకన్ డ్రైవ్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. పూనేలో టీనేజర్ నిర్లక్ష్యంగా కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్ష పాస్ అయిన తర్వాత మిత్రులతో కలిసి సరదాగా పబ్‌లో మందుపార్టీ చేసుకున్నాడు.
చత్తీస్‌గఢ్‌లో పికప్ వ్యాన్ బోల్తా పడ్డంతో సుమారు 18 మంది మృతి చెందారు. వారిలో 17 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.. నలుగురికి గాయాలు అయ్యాయని చత్తీస్‌గఢ్‌లోని కబీర్‌థామ్ జిల్లాలో పికప్ వ్యాన్ లోయలోపడ్డంతో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అధికారులు సోమవారం నాడు చెప్పారు
హైదరాబాద్ మహానగరంలో వారాంతాల్లో కుటుంబంతో సహా హోటల్‌కు వెళ్లి భోజనం చేద్దామనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి ఫుడ్ సెఫ్టీ అధికారులు నగరంలోని పాపుల్ హోటల్స్‌పై తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో హోటల్ యజమానులు అస్సలు ప్రమాణాలు పాటించడం లేదని తెలిసింది.
బెంగళూరులో రేవ్‌పార్టీ గుట్టురట్టైంది. బర్త్‌డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. రేవ్ పార్టీలో ప్రముఖులు, బడాబాబులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు.
: ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు ఒడిషాలో సుడిగాలి పర్యటన చేశారు. కటక్‌లో జరగిన ఓ ఎన్నికల ర్యాలీలో బిజు జనతాదళ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్టం మొత్తం మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నెలకొంది. సోమవారం నాడు ఐదవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక మిగిలింది కేవలం రెండు విడతల పోలింగ్ మాత్రమే. ఇక అందరి దృష్టి స్టాక్ మార్కెట్లపై పడింది. ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి.