Home / తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి పై గుత్తి మండలం బాచుపల్లి దగ్గర కారు, లారీ ఢీ కొన్న సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో ఎన్నికల సందర్భముగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు చేసారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసారు
కాపుసంక్షేమ నేత ,సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాసారు .గత కొంతకాలంగా ఏపీలో ఎన్డీయే కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ,కూటమిలోని టీడీపీ కి సలహాలు ,సూచనలు చేస్తూ లేఖలు రాయడం తెలిసిందే.
: కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న మాజీమంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన స్థలాన్నికొందరు ఆక్రమించుకుంటున్నారని వారు ఆరోపించారు.
టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరామ్.. చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు.
భారతీయ జనతాపార్టీ అబ్ కీ బార్ 400 పార్ అంటూ ఎన్నికలకు ముందు ఈ నినాదం హోరెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి అమిత్ షా వరకు దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్త అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని తలెత్తుకున్నాడు. అయితే ప్రారంభంలో ఉన్న జోష్ ఇప్పుడు మాత్రం కనపడ్డం లేదు
ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక జాతీయ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల సందర్భంగా ఇచ్చే తాయిలాల గురించి పలు ప్రశ్నలు సంధించారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తగాదాలు రావడంతో కుమారుడు తల్లి అంతక్రియలను ఆపేశారు. పెద్దఖర్మ ఖర్చుపై పంచాయతీ తేలితేనే తలకోరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో మృతదేహం ఫ్రీజర్‌లోనే ఉండిపోయింది.
ఎట్టకేలకు ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. మూడేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది.
నెల రోజుల నుంచి కొనసాగుతున్న గంగవరం పోర్టు కార్మికుల సమ్మె ఒక కొలిక్కి వచ్చింది. కార్మికులు శుక్రవారం నుంచి విధుల్లోకి వెళ్ళుతున్నారు . తమ జీతాలు పెంచాలని పోర్ట్ లోని నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 15 న సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే