Home / తాజా వార్తలు
దేశభక్తి, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో రగిలేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు సహా యావత్ తెలంగాణ సమాజం ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవితవ్యం పై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సీడ్స్ దుస్తుల కంపెనీలో మరోసారి విషవాయువు కలకలం రేపింది. ఈ ఏడాది జూన్ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా అదే కంపెనీలోని బి.షిఫ్టులో పనిచేస్తున్న 150 మంది మహిళా ఉద్యోగులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు
హీరో కంటే విభిన్నమైన నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అడవి శేష్ త్వరలో హిట్ 2 సినిమా తో మన ముందుకు రబోతున్నాడు.షెడ్యూల్ ప్రకారం హిట్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వాల్సింది కాని అడవి శేష్ బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అవుతుంది. మేజర్ సినిమా ప్రమోషన్ కోసం దేశ వ్యాప్తంగా తిరుగుతున్న నాకు కాస్త బ్రేక్ కావాలని అంటున్నారు.
మహారాష్ట్రలో ఈ నెలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 800,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 2022 జూలై 11 మరియు 12 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల 24 జిల్లాల్లోని రైతులు ఎక్కువగా మరాఠ్వాడ మరియు విదర్భ ప్రాంతాలలో నష్టపోయారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, మరియు అరటి పంటలు
భారత క్రికెట్‌కు, సునీల్ గవాస్కర్‌కు గర్వకారణమైన విషయం. ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ క్రికెట్ అథారిటీ తమ మైదానానికి గవాస్కర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించింది.ఇది 5 ఎకరాల మైదానం. ఇప్పటికే గవాస్కర్ చిత్రాన్ని స్టేడియం వెలుపల ఉన్న గోడలలో ఒకదానిపై చిత్రీకరించారు.
హీరో శ్రీవిష్ణు డెంగ్యూ జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. దీనితో అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విష్ణు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సన్నిహితులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది.
దేశంలో విమానయాన ట్రాఫిక్ నిరంతరం పెరుగుతోంది, జనవరి-జూన్ మధ్య కాలంలో దేశీయ విమానయాన సంస్థల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు 66.73 శాతం పెరిగి 343.37 లక్షల నుండి 572.49 లక్షలకు చేరుకున్నట్లు డీజీసీఏ గణాంకాలు తెలిపాయి.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి సమంత పాల్గొంది.