Home / తాజా వార్తలు
రాజస్థాన్‌లోని తొమ్మిది జిల్లాల్లో లుంపి చర్మవ్యాధి కారణంగా 2,500 పైగా పశువులు మరణించడంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. వైరల్ వ్యాధి కారణంగా 2,500 పశువులు చనిపోగా, మరో 50,000 పశువులకు సోకింది. వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పటికే తొమ్మిది జిల్లాలకు వ్యాపించింది.
తాను నరేంద్ర మోదీకి భయపడనని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యను చూసి భయపడబోనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ చర్యలను "బెదిరింపు ప్రయత్నం"గా ఆయన అభివర్ణించారు."దేశాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు దేశంలో సామరస్యాన్ని కొనసాగించడానికి నేను పని చేస్తూనే ఉంటాను.
కామన్వెల్త్ మహిళా క్రికెట్ కీలక మ్యాచ్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బార్బడోస్‌ను చిత్తుగా ఓడించి గ్రూప్-A నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్ 56 పరుగులతో నాటౌట్, బౌలింగ్‌లో రేణుకా సింగ్ 4 వికెట్లతో విజృంభించిన వేళ భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. మంగళవారం నుంచి దిల్లీ, లఖ్‌నవూ, కోల్‌కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. కాంగ్రెస్‌కు చెందిన హెరాల్డ్ హౌస్‌లోని యంగ్ ఇండియన్ ఆఫీస్‌ను సీజ్
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టెలికాం గేర్ల తయారీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్, నోకియా
రాయలసీమ జిల్లాలను వానలు వదలడం లేదు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో జోరు వానతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ మండలం తెర్నేకల్, కుంకునూరులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై తానేమీ స్పందించబోనని ఆయన సోదరుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ఈడీ సీజ్ చేయడంపై ఢిల్లీలో ఎంపీలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎంపీ మాధవ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ వీడియో కాల్ లో ఉంది. ఆ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎంపీ తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కేబినెట్లో యువరక్తాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కెబినెట్‌ను విస్తరించారు. మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు అవకాశం కల్పించారు. కేబినెట్ మార్పులు చేర్పుల్లో కొత్తగా ఆరుగురిని కేబినెట్లోకి తీసుకున్నారు.
ఏపీ సీఎం జగన్ ‘జగనన్న తోడు’ పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్