Home / తాజా వార్తలు
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. చీమ చిటుక్కుమన్నా యావత్ ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతోంది. తాజాగా గువాహతి రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన వీడియోను కోట్లాది మంది చూశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో అన్న క్యాంటీన్లకు మళ్లీ కళొచ్చింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పేదల కోసం అన్నక్యాంటీన్లు ప్రారంభించింది. 5 రూపాయిలకే పేదలకు, నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించింది.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ శాసనసభ్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు.
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
కర్నూలు జిల్లా వెల్దురి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిడిపి నాయకుడు గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.
కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం నాడు ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం ఆదివారం నాడు న్యూఢిల్లీలోని రాష్ర్టపతి భవన్లో కన్నుల పండువగా జరిగింది. దేశ, విదేశాల నుంచి పలువురు అతిథులను ఆహ్వానించారు.
:జమ్ము కశ్మీర్లో లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ప్రధానంగా హిందూ భక్తులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా శివ్ ఖోరీ నుంచి వైష్ణోదేవీకి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఎల్‌ఏటి టెర్రరిస్టులు టార్గెట్‌గా చేసుకున్నారు.
ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం నాడు మూడవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో పనిచేసిన 37 మంది మంత్రులను ఆయన ఈసారి తప్పించారు. కాగా గతంలో మంత్రులుగా చలామణి అయిన 18 మంది ఓడిపోయారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.