Last Updated:

Pushpa 2 Collections: బాక్సాఫీసు వద్ద ‘పుష్ప 2’ ప్రభంజనం – హిందీలో రికార్డు బ్రేక్‌ వసూళ్లు, మూడు రోజుల్లో ఎంతంటే!

Pushpa 2 Collections: బాక్సాఫీసు వద్ద ‘పుష్ప 2’ ప్రభంజనం – హిందీలో రికార్డు బ్రేక్‌ వసూళ్లు, మూడు రోజుల్లో ఎంతంటే!

Pushp 2: The Rule Hindi Collection: అల్లు అర్జున్‌ పుష్ప 2 రికార్డులు తిరగరాస్తుంది. సునామీ వసూళ్లతో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా తుఫానులా చెలరేగిపోతుంది. కాగా పుష్ప పార్ట్‌ వన్‌తో అల్లు అర్జున్‌ నార్త్‌ మంచి మార్కెట్‌ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో తనదైన స్టైల్‌, మాస్‌ ఇమేజ్‌ అక్కడ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. నార్త్‌లో అతడి క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ట్రైలర్‌ ఈవెంట్‌కి వచ్చని రెస్పాన్స్‌ స్పెషల్‌ ఎక్సాంపుల్‌.

ఇక రిలీజ్‌ తర్వాత హిందీ బాక్సాఫీసు వద్ద పుష్ప సునామీ వసూళ్లు రాబడుతూ అన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తుంది. ఒక సౌత్‌ సినిమా నార్త్‌ బెల్ట్‌ను ఏలేస్తుందంటూ మూవీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్స్‌ ట్వీట్‌ చేశాడు. తొలి రోజే ఈ సినిమా రూ. 294 కోట్ల గ్రాస్‌ వసూళ్లతో గ్రాండ్‌ ఒపెనింగ్‌ ఇచ్చింది. ఏ ఇండియన్‌ సినిమా ఈ ఫస్ట్‌ డే ఈ రేంజ్‌లో ఈ రేంజ్‌లో కలెక్షన్స్‌ చేయలేకపోయింది. తొలిరోజే గ్రాండ్‌ ఒపెనింగ్‌ ఇచ్చిన తొలి తెలుగు సినిమాగా పుష్ప 2 రికార్డు నెలకొల్పింది.

ఇక నార్త్‌లో ఈ సినిమా రోజురోజుకు వసూళ్లు పెంచుకుంది. ఫస్ట్‌ డే అక్కడ రూ. 72 కోట్ల గ్రాస్‌ రాబట్టిన పుష్ప మూడో రోజు మరింత ఎక్కుడ వసూళ్లు చేసింది. రెండో రోసు కలెక్షన్స్‌లో తగ్గిన మూడో రోజు ఫస్ట్‌డే, సెకండ్‌ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఫస్ట్‌ డే రూ. 72 కోట్లుగా ఉన్న ఈ సినిమా రెండవ రోజు రూ. 56 కోట్లు చేసింది. ఇక మూడో రూ. 74 కోట్ల గ్రాస్‌ చేసి మూడు రోజుల్లోనే రూ. 205 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది రికార్డు క్రియేట్‌ చేసింది. మూడు రోజుల్లోనే రెండు వందలకు పైగా కోట్లు కలెక్షన్స్‌ చేసిన తొలి సౌత్ ఇండియన్‌ మూవీగా చరిత్ర తిరగరాసింది. ఇక మూడు రోజుల్లోనే వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా రూ. 621 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ చేసినట్టు మూవీ టీం వెల్లడించింది.