ICQC: ఐసీక్యూసీ యూనిట్ ప్రారంభం.. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో విమానయాన భద్రత

ICQC Aviation Safety International Standards: భారత విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానయాన భద్రతను కల్పించేందుకు క్వాలిటీ కంట్రోల్ యూనిట్‌ను (ఐక్యూసీయూ) ప్రారంభించినట్లు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐఎన్‌టీ) దీపక్ వర్మ ఆదివారం తెలిపారు. ఐక్యూసీయూ ఏర్పాటు చేసి, దేశంలోని 68 విమానాశ్రయాల్లో విమానయాన భద్రతా దళం (ఏఎస్‌జీ) అందించే భద్రతను మెరుగుపర్చేందుకు సీఐఎస్ఎఫ్ దళం కీలకమైన ముందడుగు వేసిందన్నారు.
ప్రపంచస్థాయి భద్రతా విధానాలు, సాంకేతికతలను రూపొందించడంలో ఐక్యూసీయూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సంస్థ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరీటి (బీసీఏఎస్) జారీ చేసిన నేషనల్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ క్వాలీటీ కంట్రోల్ ప్రోగ్రాం-2024 (ఎన్‌సీఏఎస్‌క్యూసీపీ), ఎయిర్ క్రాఫ్ట్ సెఫ్టీ కండిషన్స్-2023కి అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు.