Home / తాజా వార్తలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విశాఖ చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న పవన్ అక్కడనుంచి అనకాపల్లి వెళ్లి నూకాంబికా అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఢిల్లీలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఖాళీ చేయడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది.
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చారు. వచ్చి రాగనే పీఎం కిసాన్నిధి 17వ ఇన్స్టాల్మెంట్ ఫైల్‌పై సంతకం చేశారు.
తెలుగు దేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో.. అమరావతికి పునర్ వైభవం రానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కలల రాజధాని అమరావతిని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరుగున పడేసింది. దాంతో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక ముందే.. చెట్టు, ముళ్ల కంపలతో నిండిపోయిన రాజధానిని అధికారులు శుభ్రం చేసే పనిలో పడ్డారు.
ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ వివరించింది.
టెస్లా చీఫ్‌ఎలాన్ మస్క్ ఇండియాలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను ఉపసంహరించుకున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఎన్నికల్లో నరేంద్రమోదీ విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు
హమాస్ టెర్రరిస్టుల చెర నుంచి నలుగురు ఇజ్రాయెల్ పౌరులను సురక్షితంగా రక్షించి స్వదేశానికి తీసుకువచ్చింది ఇజ్రాయెల్ మిలటరి. కాగా హమాస్ టెర్రరిస్టులు గత ఏడాది అక్టోబర్ 7న వీరిని సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ అండర్గ్రాడ్యుయేట్ (NEET UG) 2024 ఫలితాలు తీవ్ర వివాదంగా మారాయి. నీట్ పరీక్షలు మొదలైన తర్వాత నుంచి పలు వివాదాలు చుట్టుముట్టాయి. వాటిలో పేపర్ లీక్ కావడం ఒక ఎత్తైతే.. ఇష్టం వచ్చినట్లు మార్కులు ఇచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఒడిషాలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు నవీన్‌పట్నాయక్. ఆయన రాజకీయ వారసుడు వీకె పాండ్యన్ అనే టాక్ గత కొంత కాలంగా రాష్ర్టం మొత్తం వినిపిస్తోంది.