Home / తాజా వార్తలు
నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం అయ్యింది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ర్టపతి ద్రౌపది ముర్ముమోదీతో పాటు ఆయన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌ను చండీఘడ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ సందర్భంగా అక్కడి లేడీ కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. అటు తర్వాత సోషల్ మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాహుల్‌గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాహుల్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేయాలా వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ప్రతాప్‌సింగ్ బజ్వా చెప్పారు.
ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ పరువు నిలుపుకుంది. అయితే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ పొత్తు మ్యాజిక్ బాగా పనిచేసింది. మొత్తం 80 స్థానాలకు గాను ఇండియా కూటమికి 43 సీట్లు సాధించింది
వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న విజయం సాధించారు.
Ramoji Rao: తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. రామోజీరావు శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థకు గురికావడంతో.. హైదరాబాదులోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిన్నిటి నుంచి చికిత్స పొందుతూ.. మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన బంధువులు తెలిపారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. అక్షర యోధుడు..( Ramoji Rao) రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం తెలిపుతున్నారు. ప్రధాని మోదీ, టీడీపీ […]
రెడ్ బుక్..ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెడ్ బుక్...ఈ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెడ్ బుక్ పేరు వినగానే వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధమైందంటూ ఏపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు చోటు చేసుకోవడంతో ఐటి నిపుణుల కంటే చెఫ్‌ల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది బ్రిటన్ డిపెండెంట్స్ వీసాలను నిలిపివేసింది.
ఏపీ బేవరేజీస్ కార్పొరేష్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఉదయం మూడు వాహనాల్లో వచ్చిన ఏపీ పోలీసులు హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని వాసుదేవ రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు
ఈ ఏడాది ఎండలు ఏ విధంగా ఉన్నాయనడానికి ఇదే చక్కటి ఉదాహరణ. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) అమ్మకాలు మే నెలలో ఏకంగా 20 శాతం పెరగాయని పార్మాట్రాక్ తాజా గణాంకాలను వెల్లడించిందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.