Home / తాజా వార్తలు
తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైందని..తిరుమల మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని చంద్రబాబు అన్నారు.
మోష్ పబ్ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్ కేసును ఛేదించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు ముఠా గ్రూప్‌గా ఫామ్ అయ్యారన్నారు. యువతులను ఎరవేసి యువకులను ట్రాప్ చేసి వారి పేర్లను మార్చి డేటింగ్ సైట్స్‌లో ఫోటోస్ పెట్టి చాట్ చేసినట్లు వెల్లడించారు.
ఆస్తి కోసం మామను హత్య చేయించింది కోడలు. రూ.300 కోట్ల ఆస్తి దక్కించుకునేందుకు ఆమె రూ.1 కోటి సుపారి ఇచ్చి చంపింది. ఇక కోడలు విషయానికి వస్తే ఆమె సాదా సీదా మహిళ కూడా కాదు. టౌన్ ప్లానింగ్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్. ప్రస్తుతం ఆమె కటకటాల పాలైంది. దీనికి సంబంధించిన వివరాలివి..
: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదానికి 41 మంది మృతి చెందారు. సుమారు 30 మంది భారతీయ కార్మికులు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం ఆరు గంటలకు జరిగిందని కువైట్ వైద్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు.
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప హత్య కేసులో ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. పవిత్ర గౌడ అనే యువతిలో అక్రమ సంబంధమే హత్యకు దారితీసింది. ప్రస్తుతం శాండిల్‌వుడ్‌లో ఈ కేసు సంచలనం రేపుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కటకట తీవ్రంగా ఉంది. రాజధాని ప్రజలను మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అదే సమయంలో ట్యాంకర్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా మొదటి మూడు రోజుల పాటు కొత్తగా ఎన్నికైనా లోకసభ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుంది.
సినిమా ఘూటింగ్లలో పలు చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని తమాషాగా ఉంటాయి. తాజాగా హిందీ కొరియాగ్రాఫర్ నుంచి ప్రస్తుతం దర్శకురాలిగా ఎదిగిన ఫరాఖాన్ ఒకరు. ఆమె తన మొట్టమొదటి పాటకు కొరియాగ్రఫీ చేసిన సంఘటనకు సంబంధించిన విశేషాలను చాట్ విత్ రేడియో నషాతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) - 2024 ఫలితాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రకటించారు. ఈ పరీక్షకు 2,86,381 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.