Last Updated:

Heavy Rains: మరో రెండురోజులపాటు తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ. సోమ, మంగళవారాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

Heavy Rains: మరో రెండురోజులపాటు తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

Hyderabad: తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ. సోమ, మంగళవారాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. రాష్ట్రంపై ఉన్న మేఘాల ఉద్ధృతి నమూనాలను పలుమార్లు పరిశీలించి ఈ మేరకు అంచనా వేస్తోంది. దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో 35 సెం.మీ. దాటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్ట్రంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయన్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత భారీగా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ వర్షాలతో తెలంగాణ తడిచి ముద్దవుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాల్లో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు ఉప నదులు పోటెత్తడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టులకు వరద అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొన్నిచోట్ల వరద రోడ్లపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాంతంలో చరిత్రలోనే జులై నెలలో అత్యంత భారీ వర్షం నమోదైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతోపాటు రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడ్డాయి.రాష్ట్రవ్యాప్తంగా 344 ప్రాంతాల్లో సెంటీమీటరు నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షం కురుస్తూనే ఉంది. కొన్నిచోట్ల ముసురు పట్టినట్లు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తూ కొంత సమయం తెరిపి ఇచ్చాయి.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల కేంద్రంలోని జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలోకి మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. విద్యార్థులను కలుసుకునేందుకు ఆదివారం వచ్చిన వారి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో రాస్తారోకో చేశారు. సమస్య పరిష్కారానికి ప్రిన్సిపల్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మూడు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవుపేటలోని జంగల్‌నాలా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరి మత్తడి పారుతోంది. ఈ నీటిలో చేపలు భారీగా బయటికి వస్తున్నాయి. వీటిని పట్టుకునేందుకు జాలర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఇనుప జాలీల్లో చిక్కుకుపోయి ఇలా కనిపించాయి.

ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరులో 18.3 సెం.మీ. భారీ వర్షం నమోదైంది. వేములపల్లి మండలం నీల్వాయిలో 15, కోటపల్లిలో 14.7 సెం.మీ. కురిసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ముత్తారం(మహదేవ్‌పూర్‌)లో 14.7, మహదేవ్‌పూర్‌ లో 12.5 సెం.మీ కురిసింది. పెద్దపల్లి జిల్లా పాలెంలో 11, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో 10.6, భద్రాద్రి కొత్తగూడెంలో 10.3 సెం.మీ. వర్షం కురిసింది.

ఇవి కూడా చదవండి: