Published On:

Telangana government: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana government: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Good news from Telangana Government: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన యూనివర్సిటీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం మెడికల్ అండ్ హెల్ట్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో, శాతవాహన, కాకతీయ, పాలమూరు యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది.

 

ఆసక్తి గల అభ్యర్థులు http://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను జులై 10వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జులై 17 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను 18 జులై నుంచి 19 సాయంత్రం 5 వరకు ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సపరేట్‌ ఒక్కో ఒక్కో పోస్టుకు దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. మల్టీ జోన్-1లో 379 పోస్టులు ఉండగా, మల్టీ జోన్-2లో 228 పోస్టులు ఉన్నాయి. పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలవారి జీతం యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ నిబంధనల ప్రకారం రూ.68,900 నుంచి రూ.2,05,500 ఉందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

 

మరో 8 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా యూనివర్సిటీల్లో 15 ఏళ్లకుపైగా పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రం ఎప్పటిలాగే కొనసాగనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయనున్నారు. యూనివర్సిటీలు రిజర్వేషన్లను పాటించేందుకు రోస్టర్‌ పాయింట్లు రూపొందించి, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: