Telangana: రాష్ట్ర ప్రభుత్వానికి కంటోన్మెంట్ భూములు

DRDO Agree To Give Its Lands: రక్షణశాఖతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణశాఖ సిద్ధమైంది. అందుకు ప్రతిగా శామీర్ పేటలోని భూములను తెలంగాణ సర్కార్ ఇవ్వనుంది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రక్షణశాఖతో ఒప్పందం చేసుకోనుంది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 90 ఎకరాల భూములను కేంద్ర రవాణా శాఖ ఇవ్వనుంది. రక్షణశాఖ భూముల కారణంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు.. ఈ ఒప్పందం పూర్తయితే ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత వేగం కానున్నాయి.
స్టేట్ హైవే-1పై, జేబీఎస్ నుంచి శామీర్ పేట వరకు 22కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ తో పాటు నేషనల్ హైవే- 44 పార్యడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు 5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇక కేంద్ర రక్షణ శాఖ ఇచ్చే భూములకు ప్రతిగా శామీర్ పేటలో ల్యాండ్ ఇవ్వనుంది. దీంతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కంటోన్మెంట్ భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.