Last Updated:

Baghpat Stage Collapse: లడ్డూ కోసం పోటీపడగా.. ఐదుగురు మృతి.. సీఎం ఆరా!

Baghpat Stage Collapse: లడ్డూ కోసం పోటీపడగా.. ఐదుగురు మృతి.. సీఎం ఆరా!

Baghpat Stage Collapse issue 5 Killed, Over 60 Injured in Laddu Festival: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో లడ్డూ మహోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవంలో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అలాగే ఈ ప్రమాదంలో దాదాపు 60 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

యూపీలోని బాగ్ పత్‌లో ఉన్న ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. అయితే ఇందుకోసం చెక్కతో కూడిన వేదికను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో జైన శిష్యులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం గాయపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా, వేదికను వెదురుకర్రలతో నిర్మించింది కావడంతో పాటు ప్రజలు ఒక్కసారిగా వేదికపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అయితే ఈ ఘటనలో ఆరుగురు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం వాటిని తొలగించి బయటకు వెలికితీశారు.

ఇదిలా ఉండగా, డీఎం బాగ్‌పత్ అస్మితా లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం బరౌత్ తహసీల్ ప్రాంతం రద్దీగా ఉండడంతో పాటు కాంప్లెక్స్ లో వెదురుతో ఏర్పాటు చేసిన వేదికపై భక్తులు ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటపలో ఐదుగురు మృతి చెందగా.. మరికొంతమంది గాయపడ్డారు. వీరిని బరౌత్ పట్టణంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.