Last Updated:

KCR: కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం.. సీఎం కేసీఆర్

కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతాయిపల్లి పరేడ్ గ్రౌండ్‎లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

KCR: కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం..  సీఎం కేసీఆర్

KCR: కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతాయిపల్లి పరేడ్ గ్రౌండ్‎లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లా అవుద్దని ఎవరూ కలలో కూడా అనుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా కోసం పెద్ద చర్చ జరిగిందని.. తెలంగాణ ఏర్పాటు వల్లే జిల్లా సాధ్యమైందని కేసీఆర్ అన్నారు.కుల, మత రాజకీయాలు దేశానికి మంచిది కాదని కేసీఆర్ అన్నారు. నీచ రాజకీయాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని.. కుల మతాలకు అతీతంగా పని చేయాలని కేసీఆర్ అన్నారు.

దేశరాజధాని ఢిల్లీలో 24 గంటల కరెంటు ఇవ్వ లేని పరిస్థితిలో దేశం ఉందని.. తెలంగాణలో మాత్రం కరెంట్ సమస్య లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్ గోండు గూడెంలో అయినా.. హైదరాబాద్ బంజారా హిల్స్‌లో అయినా 24 గంటలు కరెంట్ ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి: