Last Updated:

woman slapped French President’s cheek : ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన మహిళ

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ ఆయన చెంపను ఛెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

woman slapped French President’s cheek : ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన మహిళ

French President Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ ఆయన చెంపను ఛెళ్లుమనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన నడుస్తూ వెళ్తుండగా ఆలివ్ గ్రీన్ టీషర్ట్ ధరించిన మహిళ చెంపపై కొట్టింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మాక్రాన్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను పక్కకు లాగేశారు.

ఫ్రాన్స్ డ్రోమ్ రీజియన్‌లో టైన్ హెర్మిటేజ్ టౌన్‌లో ఫుడ్, రెస్టారెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ కార్యక్రమానికి అధ్యక్షుడు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలను మరింత సరళతరం చేయడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంత మంది వద్దకు మాక్రాన్ వెళ్లారు. ఇంతలో ఊహించని విధంగా మాక్రాన్ చెంపను అక్కడున్న ఒక మహిళ ఛెళ్లుమనిపించింది. అక్కడున్న ఓ వ్యక్తితో మాట్లాడేందుకు మాక్రాన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా మాక్రాన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.