Last Updated:

Dallas: డల్లాస్ లో టీడీపీ నేత కేసీ చేకూరి అరెస్ట్

తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన కేసీ చేకూరి డల్లాస్ లో అరెస్ట్ అయ్యారు.

Dallas: డల్లాస్ లో టీడీపీ నేత కేసీ చేకూరి అరెస్ట్

Dallas: తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన కేసీ చేకూరి డల్లాస్ లో అరెస్ట్ అయ్యారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డల్లాస్ లో తెలుగు ఎన్నారై అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌ లో ఆయన దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న బాలకృష్ణ వీరసింహారెడ్డి , చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాల హోర్డింగ్లు పట్టుకుని పవన్,బాలయ్య ఫాన్స్ రచ్చచేసారు. కేసీ చేకూరి అనే ఎన్నారై ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తూ అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానుల వద్దకు వెళ్లారని అప్పుడు వారు ‘జై పవన్’ అంటూ నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని అంటున్నారు. డౌన్ డౌన్ చిరంజీవి ..డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్.. సంక్రాంతి కింగ్ బాలయ్య .. వాల్తేరు వీరయ్య డొల్లయ్య అంటూ నినాదాలు చేయడంతో గొడవ ఇంకొంచం ముదిరింది.

అంతేకాకుండా .. టీడీపీ మద్దతు లేకపోతే ఈ సారి నాలుగు చోట్ల పోటీ చేసినా అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు అంటూ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ రెచ్చిపోయారు టీడీపీ, బాలయ్య ఫాన్స్ . ఎలాగైనా ఒక్కసారైనా అసెంబ్లీలోకి రావాలనే టీడీపీ పంచన చేరుతున్న పౌడర్ స్టార్ పవన్ అంటూ హేళన చేయడంతో పవన్ ఫాన్స్ ఆగ్రహానికీ గురయ్యారు . దీనితో ఇరువర్గాలు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కేసీ చేకూరి ఈవెంట్ మేనేజర్లపై కూడా దాడి చేసినట్లు సమాచారం. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసీ చేకూరిని అరెస్ట్ చేసారు.

ఇవి కూడా చదవండి: