Mark Zuckerberg: బైడెన్ ప్రభుత్వం ఒత్తిడి చేసింది.. మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఆరోపణలు
![Mark Zuckerberg: బైడెన్ ప్రభుత్వం ఒత్తిడి చేసింది.. మెటా సీఈఓ జుకర్ బర్గ్ ఆరోపణలు](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/01/బైడెన్-ప్రభుత్వం-ఒత్తిడి-చేసింది.-మెటా-సీఈఓ-జుకర్-బర్గ్-ఆరోపణలు.webp)
Zuckerberg sentational comments on Biden admin people: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ పై వచ్చిన దుష్ప్రభావాలపై వచ్చిన పోస్టులకు సంబంధించి పలు ఆరోపణలు చేశారు. ఈ పోస్టుల విషయంలో జోబైడెన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని, ఆ పోస్టులు తొలగించాలని చెప్పిందన్నారు.
తాజాగా, ‘ద జో రోగన్ ఎక్స్ పీరియన్స్’ పాడ్ కాస్ట్ లో భాగంగా ఆయన స్పందించారు. అమెరికాలో కోవిడ్ 19 సమయంలో జో బైడెన్ కరోనా టీకాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిసంఖ్య పెరిగిందన్నారు. అయితే నేను టీకాలకు అనుకూలంగానే ఉండేవాడినని, కానీ వ్యతిరేకంగా వస్తున్న వాటిపై సెన్సార్ చేసేందుకు జోబైడెన్ ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నించిందని పలుమార్లు అనిపించిందన్నారు.
కరోనా వ్యాక్సిన్ కారణంగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వ్యతిరేకంగా పోస్టుల సంఖ్య పెరిగిందని, ఈ తరుణంలో ఆ సభ్యకర పోస్టులు తీసివేయాలని అమెరికా వైట్ హౌస్ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇదంతా చాలా ఫన్నీగా అనిపించదని, అలా చేయకూడదని చాలాసార్లు అనిపించందని జుకర్ బర్గ్ తెలిపారు.