Home / అంతర్జాతీయం
ఫిలిప్పీన్స్ లోని క్యూజోన్ నగరంలో నివాస ప్రాంతంలోని దుస్తుల కర్మాగారంలో గురువారం మంటలు చెలరేగడంతో 15 మంది మరణించారు. వరదలు, భారీ ట్రాఫిక్ తో అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకోలేకపోయారని అగ్నిమాపక రక్షణ అధికారి తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లోని ఐదంతస్తుల భవనంలో అనుకోని రీతిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అత్యవసర సేవల
ప్రస్తుత ప్రపంచంలో పలు దేశాల మధ్య మైత్రి బంధం అయితే లేదని చెప్పాలి. ఇరాన్ - ఇజ్రాయెల్, ఉత్తర కొరియా - దక్షిణ కొరియా ఇలా పలు దేశాలలో పరిస్థితులను గమనించవచ్చు. అయితే అదే ఇప్పుడు ఇరాన్ దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్ కొంప ముంచింది. అతను చేసిన పని వల్ల ఇప్పుడు జీవితకాలం నిషేదాన్ని
పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారి విద్యుత్ చార్జీలు భారీగా పెంచడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఆగ్రహం కాస్తా ప్రజలను రోడ్డుపైకి తెచ్చేలా చేసింది. విద్యుత్ బిల్లులు చెల్లించమని తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెంచిన విద్యుత్ బిల్లులపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇడాలియా హరికేన్ ఫ్లోరిడా గల్ఫ్ తీరం వైపు ప్రయాణిస్తుండటంతో సమీప రాష్ట్రాల్లో అత్యవసర పరిస్దితి నెలకొంది. రాష్ట్రంలోని 67 కౌంటీలలో 49 అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఫ్లోరిడాతో పాటు, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా మరియు జార్జియా కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు తోషా ఖానా కేసులో భారీ ఊరట లభించింది. ట్రయల్ కోర్టు తోషా ఖానా కేసులో ఖాన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నెల 5వ తేదీన ఖాన్ అరెస్టు అయ్యి అటాక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
బ్రిక్స్ దేశాల సదస్సులో మన ప్రధాని మోదీతో కలిసి పాల్గొని నాలుగు రోజులు కూడా కాకముందే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నారు. నిన్న అంటే ఆగస్టు 28న చైనా విడుదల చేసిన కొత్త మ్యాపులో భారతదేశానికి చెందిన ప్రాంతాలని తమవని చెబుతూ ముద్రించారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (ఇండో-పసిఫిక్) గీతికా శ్రీవాస్తవ, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో చార్జ్ డి'అఫైర్స్‌గా బాధ్యతలు చేపట్టే మొదటి మహిళా దౌత్యవేత్తగా బాధ్యతలు చేపట్ట బోతున్నారు.
బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్వర్క్ వ్యవస్థ ఫెయిల్ అయ్యింది. కంపూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ గగనతలాన్ని మూసివేశారు. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
యూకే ప్రతిపక్ష లేబర్ పార్టీ పార్లమెంటు సభ్యు రాలు మరియు మహిళలు మరియు సమానత్వాల కోసం షాడో మంత్రి 1960ల నాటి వైద్య పరిశోధనపై చట్టబద్ధమైన విచారణకు పిలుపునిచ్చారు. ఇది భారతీయ సంతతికి చెందిన మహిళలకు ఇనుము లోపాన్ని ఎదుర్కోవడానికి రేడియోధార్మిక ఐసోటోప్‌లను కలిగి ఉన్న చపాతీలను ఇచ్చిన విషయానికి సంబంధించినది.