Home / అంతర్జాతీయం
2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్‌లకు అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది.
యూకేలో జాత్యహంకారానికి అర్దంపట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నర్సులు సిక్కు రోగి యొక్క గడ్డాన్ని ప్లాస్టిక్ గ్లోవ్స్‌తో కట్టి, అతని మూత్రంలో అతడినివదిలి, మతపరమైన కారణాల వల్ల తినలేని ఆహారాన్ని అతనికి అందించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి తన మరణశయ్యపై ఉన్న నోట్లో వివక్ష గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ నర్సులను కొనసాగించారు.
గత వారం రోజుల్లో బ్రెజిల్ లోని అమెజాన్ లో 100 కు పైగా డాల్ఫిన్లు మృతిచెందాయి. తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో నీటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మరిన్ని త్వరలో చనిపోతాయని నిపుణులు అంటున్నారు.
కోవిడ్-19కి వ్యతిరేకంగా mRNA వ్యాక్సిన్ల అభివృద్ధిలో విప్లవాత్మక కృషి చేసినందుకు శాస్త్రవేత్తలు కాటలిన్ కారికో మరియు డ్రూ వీస్‌మాన్‌లకు 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది.వీస్మాన్ మరియు కారికో యొక్క పరిశోధనలు 'ఎంఆర్ఎన్ఎ మన రోగనిరోధక వ్యవస్థతో ఎలా సంకర్షణ చెందుతుందనే దానిపై మన అవగాహనను ప్రాథమికంగా మార్చింది అని నోబెల్ కమిటీ తెలిపింది.
దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో కార్గో ట్రక్కు ప్రమాదంలో 10 మంది క్యూబన్ వలసదారులు మరణించగా 17 మంది తీవ్రంగా గాయపడినట్లు మెక్సికో మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ ఆదివారం తెలిపింది. చియాపాస్‌లోని పిజిజియాపాన్-టోనాలా హైవే యొక్క పసిఫిక్ తీరప్రాంతం వెంబడి ఈ ప్రమాదం జరిగింది.
: నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోవడంతో మరణించిన ఆరుగురు వ్యక్తులలో భారత పారిశ్రామిక వేత్త హర్పాల్ రంధవా మరియు అతని కుమారుడు ఉన్నార జింబాబ్వే మీడియా తెలిపింది
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఇటి) మోస్ట్ వాంటెడ్ నాయకులలో ఒకరిని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని పాకిస్తాన్ మీడియా నివేదించింది.26/11 ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ ఖైజర్ ఫరూక్ ను కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ప్రపంచంలోని అగ్రశ్రేణి పర్యాటక ప్రదేశాలలో ఒకటైన వెనిస్ పర్యాటకులకు ప్రవేశ రుసుమును విధించే ప్రణాళికను ప్రకటించింది. యునెస్కో హెచ్చరికల నేపధ్యంలో పర్యాటకులను తగ్గించడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదన వచ్చింది. యునెస్కో వెనిస్ ను ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చనున్నట్లు తెలిపింది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక మసీదు సమీపంలో శుక్రవారం జరిగిన 'ఆత్మాహుతి దాడి'లో సుమారుగా 52 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. ఇలాఉండగా ఈ పేలుడుకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.
:భారత్ లోని యూఎస్ ఎంబసీ గురువారం వరకు రికార్డు సంఖ్యలో ఒక మిలియన్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. మహమ్మారికి ముందు 2019 కంటే దాదాపు 20% ఎక్కువ దరఖాస్తులను ప్రాసెస్ చేసింది.