Home / అంతర్జాతీయం
సోమాలియాలోని బెలెడ్‌వేన్ నగరంలోని భద్రతా తనిఖీ కేంద్రం వద్ద జరిగిన బాంబు దాడిలో కనీసం 18 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. చెక్‌పాయింట్ వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పేలడంతో దాదాపు 40 మంది గాయపడ్డారు. ఇది ఆత్మహుతి దాడిగా భావిస్తున్నారు.
న్యూయార్క్ నగరంలోని నర్సరీలో పెద్ద పరిమాణంలో ఫెంటానిల్, ఇతర డ్రగ్స్ మరియు సామగ్రిని దాచి ఉంచినట్లు న్యూయార్క్ నగర పోలీసులు కనుగొన్నారు.న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ గోధుమ మరియు తెలుపు పౌడర్లతో నిండిన డజనుకు పైగా ప్లాస్టిక్ సంచుల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వెనిజులా లోని ఒక జైలు నుంచి బిట్‌కాయిన్ మైనింగ్ మెషిన్లు,రాకెట్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగిచింది. జైలును తమఆట స్థలంగా,ఒక కొలనుగా,నైట్ క్లబ్ గా మార్చేసిన ముఠానుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ECP) గురువారం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించింది. 2024 జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించబడుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సంఘం నియోజకవర్గాల విభజనపై పనిని సమీక్షించిందని మరియు నియోజకవర్గాల డీలిమిటేషన్ కోసం ప్రాథమిక జాబితాను సెప్టెంబర్ 27 న ప్రచురించాలని నిర్ణయించినట్లు పాక్ వార్తా సంస్థ డాన్ నివేదించింది.
కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది మరియు వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అయిన సుఖ్దూల్ సింగ్ సుఖ హత్యకు గురైన దాదాపు గంట తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతని హత్యకు బాధ్యత వహించింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మైనర్ బాలికకు చేదు అనుభవం ఎదురయింది. విమానంలో టాయిలెట్ సీటు వెనుక భాగంలో ఐఫోన్ అతికించి ఉండటంతో ఆమె షాక్ అయింది. బాలికను రికార్డ్ చేయడానికే ఫోన్ అక్కడ ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ఉక్రెయిన్‌కు 400 మిలియన్ యూరోల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. మేము రక్షణ వాహనాలు మరియు మందుపాతర తొలగింపు వ్యవస్థలకు సహాయం చేస్తాము. రాబోయే శీతాకాలం గురించి కూడా మేము జాగ్రత్త తీసుకున్నాము: మేము బట్టలు, విద్యుత్ మరియు వేడి జనరేటర్లను పంపుతాము. ప్యాకేజీ విలువ 400 మిలియన్ యూరోలు అని స్పష్టం చేసారు.
గతకొద్ది కాలంగా అంతర్యుద్దంతో సతమతమవుతున్న సూడాన్‌లోని తొమ్మిది శిబిరాల్లో గత ఐదు నెలల్లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1,200 మంది పిల్లలు మరణించారని యునైటెడ్ నేషన్స్ యొక్క శరణార్థి ఏజెన్సీ తెలిపింది. ఇవన్నీ మీజిల్స్ మరియు పోషకాహారలోపం కారణంగా జరిగాయని పేర్కొంది.
పాకిస్తాన్ ఎదుర్కొంటున్న గందరగోళానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫైజ్ హమీద్ కారణమని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. ఈ రోజు భారతదేశం చంద్రునిపైకి చేరుకుంది, భారతదేశంలో G20 సమావేశం జరుగుతోంది.
పెరూలో ఒక బస్సు పర్వత రహదారిపై నుండి లోయలో పడిపోవడంతో కనీసం 24 మంది మరణించారు.బస్సు దేశంలోని దక్షిణ-మధ్య భాగంలోని అయాకుచో నుండి జునిన్ ప్రాంతం యొక్క రాజధాని హువాన్కాయోకు ఉత్తరం వైపు ప్రయాణిస్తుండగా, స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు (06:30 GMT) ఈ దుర్ఘటన జరిగింది.