Home / అంతర్జాతీయం
ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం నాడు గాజా స్ట్రిప్‌లో తమ సైనికులలో 21 మంది మరణించినట్లు ప్రకటించింది, ఇది హమాస్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ బలగాలపై అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు
తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరంపై ఉక్రేనియన్ దళాలు కాల్పులకు దిగడంతో 27 మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. డొనెట్స్క్ ప్రాంతానికి రష్యా నియమించిన అధిపతి డెనిస్ పుషిలిన్ ఈ విషయాన్ని తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున, నైరుతి చైనాలోనియునాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి 47 మంది సమాధి అయ్యారు. అక్కడనుంచి మరో 200 మందిని తరలించడానికి అధికారులు సిద్దమయ్యారు. ఈ సంఘటన జెన్‌క్సియాంగ్ కౌంటీలోని లియాంగ్‌షుయ్ గ్రామంలో ఉదయం 6 గంటలకు జరిగింది. 18 వేర్వేరు ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు కౌంటీ ప్రచార విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది.
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సూడాన్ లో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్ ), మిత్రరాజ్యాల అరబ్ మిలీషియా మధ్య జాతి హింసలో గత సంవత్సరం సూడాన్‌లోని వెస్ట్ డార్ఫర్ ప్రాంతంలోని ఒక నగరంలో 10,000 నుండి 15,000 మంది వరకు మరణించారు.
మయన్మార్‌లోని తిరుగుబాటు దళాలు మరియు జుంటాల మధ్య కొనసాగుతున్న పోరుతో గత కొన్ని రోజులుగా వందలాది మంది ఆర్మీ సిబ్బంది భారత సరిహద్దును దాటి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోకి ప్రవేశించారు. ఈ వలసలను చూసిన మిజోరం ప్రభుత్వం మయన్మార్ సైనికులను త్వరగా పొరుగు దేశానికి తిరిగి పంపాలని కేంద్రాన్ని కోరింది.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించినట్లు అధికారిక మీడియా శనివారం నివేదించింది.హెనాన్‌లోని యన్షాన్పు గ్రామంలోని యింగ్‌కాయ్ పాఠశాలలో మంటలు వ్యాపించాయని శుక్రవారం రాత్రి 11 గంటలకు స్థానిక అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించినట్లు పీపుల్స్ డైలీ నివేదించింది.
డాగ్ఫ్లేషన్ అనేది పెంపుడు జంతువులకు ఆహారం,సంరక్షణ లకు పెరుగుతున్న ధరల కొలమానంగా ఉద్భవించింది. బ్రిటన్‌లో పెంపుడు జంతువును చూసుకునే ఖర్చు రెండు రెట్లు పెరిగింది. దీనితో దేశంలోని కుక్కల పునరావాస స్వచ్ఛంద సంస్థలు గతంలో ఎన్నడూ లేనంత డిమాండ్ ని ఎదుర్కొంటున్నాయి.
యునైటెడ్ స్టేట్స్ లో శీతల తుఫాన్లకు 10 రాష్ట్రాలలో 55 మంది మృతి చెందారు. అతి శీతలమైన గాలి, వరుస తుఫానుల కారణంగా దేశమంతటా విస్తృతంగామంచు కురుస్తున్న కారణంగా మరణాలు సంభవించాయి. టేనస్సీ రాష్ట్రంలో ఈ వారం 14 మరణాలు ఈ రకంగా సంభవించాయి.
దుబాయ్‌లోని అల్ నహ్యాన్ రాజ కుటుంబం రూ.4వేలకోట్ల భవనం , ఎనిమిది ప్రైవేట్ జెట్లు, ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నకుటుంబమని తాజాగా ఒక నివేదిక పేర్కొంది.
ఉత్తర ఇటలీ ప్రావిన్స్ అన్ని కుక్కలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది, వీధుల్లో పెంపుడు కుక్కల విసర్జితాలను శుభ్రం చేయడంలో విఫలమైతే వాటి యజమానులను కనుగొని జరిమానా విధించే ప్రయత్నంలో ఉంది.కుక్క డీఎన్ఏ సేకరించిన తర్వాత, పరీక్ష ఫలితాలు డేటాబేస్‌లో చేర్చబడతాయి. ఇది కుక్క యజమానులను ట్రేస్ చేయడానికి ఉపయోగిస్తారు.