Home / అంతర్జాతీయం
మలేసియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
తోషాఖానా కేసుకు సంబంధించి పాకిస్తాన్ కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన భార్యకు బుష్రాబీబీకి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఈ జంట పది సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనితో పాటు వీరిద్దరు 78.7 కోట్ల రూపాయలు జరిమనా విధించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు పిటిఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన షా మహ్మద్ ఖురేషిని అధికార రహస్యాల చట్టం కింది పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో డెన్మార్క్ అవినీతి రహిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత అవినీతి కలిగిన దేశాల్లో సోమాలియా 11 స్కోరుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్ 39 స్కోరుతో మొత్తం 180 దేశాల్లో 93వ స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు సైఫర్ కేసులో పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
రష్యాతో యుద్ధానికి 100,000 మోర్టార్ షెల్స్‌ను కొనుగోలు చేసేందుకు కేటాయించిన దాదాపు 40 మిలియన్ డాలర్లను పక్కదారిపట్టించడానికి ఉక్రెయిన్ ఆయుధ సంస్థ ఉద్యోగులు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి కుట్ర పన్నారని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది.
ఆఫ్రికాలోని చమురు సంపన్న ప్రాంతమైన అబేయిలోని గ్రామస్థులపై ముష్కరులు దాడి చేశారు.ఈ దాడిలో యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షకుడితో సహా 52 మంది మరణించగా 64 మంది గాయపడ్డారని ప్రాంతీయ అధికారి తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్ , రిపబ్లికన్‌పార్టీ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది.ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసు లో న్యూయార్క్‌లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడువారాల్లో 200 మందికి పైగా పిల్లలు న్యుమోనియా తో మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పంజాబ్ కేర్‌టేకర్ ప్రభుత్వం మరణించిన పిల్లలలో చాలా మంది న్యుమోనియాకు టీకాలు తీసుకోలేదని తెలిపింది. పోషకాహార లోపం, తల్లిపాలు లేని కారణంగా వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది.
ఒక లగ్జరీ బ్యాగ్ దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ ఖరీదైన బ్యాగ్‌ను బహుమతిగా పొందారంటూ వైరల్ అయిన దృశ్యాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.
హమాస్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి తమ వెంట సుమారు వంద మంది మహిళలను బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారిలో కొంత మంది గర్భం దాల్చారు.