Home / అంతర్జాతీయం
పపువా న్యూ గినియా (PNG) దేశంలో వేతనాల కోసం పోలీసులు సమ్మె చేయడంతో అల్లర్లు చెలరేగాయి. రాజధాని పోర్ట్ మోర్స్బీలోని ఆస్తులపై అల్లరిమూకలు దాడి చేసి నిప్పంటించారు. పోలీసులు గత ఏడాదిగా పెరుగుతున్న నేరాలతో పోరాడుతున్నారు. ఈ నేపధ్యంలో తమ వేతనాల్లో తగ్గింపును గుర్తించిన పోలీసులు బుధవారం ఉదయం సమ్మె ప్రారంభించారు.
నేపాల్ పోలీసులు లైంగిక వేధింపులు, కిడ్నాప్ ఆరోపణలపై 'బుద్ధ బాయ్'గా ప్రసిద్ధి చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక నాయకుడు రామ్ బహదూర్ బొమ్‌జన్‌ను అరెస్టు చేశారు. 2020లో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత బొమ్‌జన్‌ను మైనర్‌పై లైంగిక దోపిడీ కేసులో పరారీలో ఉన్నప్పుడు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
2024 సంవత్సరానికి హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్‌ను బుధవారం నాడు విడుదల చేసింది. వీటిలో జపాన్, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలకు చెందిన పాస్‌పోర్టులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులుగా గుర్తించింది. ఈ దేశానికి సంబంధించిన పాస్‌పోర్టులు ఉన్న వారు ప్రపంచంలోని 227 దేశాలకు గాను 194 దేశాలకు ఎలాంటి వీసాలు లేకుండా రాకపోకలు కొనసాగించవచ్చు
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న క్యూబా ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి ఇంధన ధరలను ఐదు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనితో లీటర్ పెట్రోల్ ధర 25 పెసోల నుండి 132 పెసోలకు పెరుగుతుంది. ఈ చర్య దాని లోటును తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది, అయితే ఇది నగదు కొరతతో ఉన్న క్యూబన్లకు జీవితాన్ని మరింత కష్టతరం చేసే అవకాశముంది.
ముంబై ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితిపేర్కొంది. అతను ఏడు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులలో శిక్షను ఎదుర్కొంటున్నాడు.
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌ను నియమించారు. సోమవారం రాజీనామా చేసిన ఎలిసబెత్ బోర్న్ తర్వాత, ఆధునిక చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ప్రధానమంత్రిగా అతను రికార్డుకెక్కారు. అంతేకాదు అట్టల్ ఫ్రాన్స్‌లో మొట్టమొదటి గే ప్రధాన మంత్రి.
దక్షిణ కొరియా పార్లమెంటు కుక్క మాంసం పరిశ్రమను నిషేధించే చట్టాన్ని మంగళవారం ఆమోదించింది. జాతీయ అసెంబ్లీ 208-0 ఓట్ల తేడాతో ఈ బిల్లును ఆమోదించింది. ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ ప్రభుత్వం నిషేధానికి మద్దతు ఇస్తోంది.దీనితో చట్టం చేయడానికి తదుపరి చర్యలు లాంఛనప్రాయంగా పరిగణించబడతాయి.
యునైటెడ్ స్టేట్స్ లో పదవీ విరమణ పొందిన ఒక జంట విన్ ఫాల్ లాటరీలో సుమారుగా రూ.200 కోట్లు సంపాదించారు. గణిత శాస్త్రంలో ప్రావీణ్యాన్ని ఉపయోగించి దాని ప్రకారం లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి వారు ఈ భారీ మొత్తాన్ని పొందగలిగారు.
మయన్మార్ లోని వాయువ్య ప్రాంతంలో ప్రజాస్వామ్య అనుకూల ప్రతిఘటన నియంత్రణలో ఉన్న ఒక గ్రామంపై పాలక మిలిటరీ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 17 మంది పౌరులు మృతిచెందారు. ఈ ఘటనలోతొమ్మిది మంది పిల్లలతో సహా 20 మందికి పైగా గాయపడ్డారని స్థానిక నివాసితులు మరియు మానవ హక్కుల సమూహం తెలిపింది.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధాని షేక్ హసీనా రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మరియు దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.