Home / అంతర్జాతీయం
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాక వారద్దిరిపై సోషల్ మీడియాలో పాక్ ప్రజలు విరుచుకు పడుతున్నారు. వారిద్దరు తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకోవడాన్ని వారు తప్పు బడుతున్నారు. ఈ నేపధ్యంలో సానియా మీర్జాకు పాకిస్తాన్‌లోని ప్రజల నుండి బలమైన మద్దతు లభించడం విశేషం.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఖాన్ యూనిస్‌లో హమాస్‌పై దాడులను కొనసాగిస్తోంది. ఇక్కడ ఉగ్రవాదులు నాజర్, అల్-అమల్ ఆసుపత్రుల లోపల మరియు చుట్టుపక్కల నుండి పనిచేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఇలోన్ లెవీ చెప్పారు.
చైనాలోని ఒక వృద్ధ మహిళ తన $2.8 మిలియన్ల సంపదను తన పిల్లులు. కుక్కలకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. షాంఘైకి చెందిన సియు కొన్ని సంవత్సరాల క్రితం వీలునామా తన ముగ్గురు పిల్లలకు తన ఆస్తిని ఇస్తూ వీలునామా రాసింది.అయితే తాజాగా ఆమె మనసు మార్చుకుంది. సియు అనారోగ్యం పాలైనప్పుడు పిల్లలు ఆమెను పట్టించుకోలేదు కాబట్టి ఆమె వీలునామాను సవరించింది
: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని జిన్యు నగరంలో బుధవారం మధ్యాహ్నం భవనంలో మంటలు చెలరేగడంతో 39 మంది మరణించగా తొమ్మిది మంది గాయపడ్డారు. జిన్యులోని యుషుయ్ జిల్లాలో వీధి దుకాణంలో మంటలు చెలరేగాయని స్థానిక ఫైర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ ప్రధాన కార్యాలయం తెలిపింది.
సౌదీ అరేబియా ప్రభుత్వం రాజధాని రియాద్‌లో ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తలకు సేవలందించే మొట్టమొదటి ఆల్కహాల్ దుకాణాన్ని తెరవడానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యం తాగిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి.
మాలిలోని బంగారుగనిలో సొరంగం కూలి 70 మందికి పైగా మరణించారని స్థానిక స్థానిక అధికారి బుధవారం తెలిపారు. గత వారం జరిగిన ఈ ప్రమాదసమయంలో 200 మందికి పైగా కార్మికులు ఉన్నారని చెప్పారు. 73 మృతదేహాలను కనుగొన్నామంటూ బంగారు గనుల అధికారి ఓమర్ సిడిబే తెలిపారు.
ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక రవాణా విమానం కూలిపోవడంతో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరణించారు. విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది కూడా ఉన్నారని రియా నోవోస్టి వార్తా సంస్థ తెలిపింది.
త ఏడాది దక్షిణాఫ్రికాలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో గొంతుకోసి చంపిన వ్యక్తి మృతదేహాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జరిగిన అగ్నిప్రమాదం 76 మంది ప్రాణాలను బలిగొందని తేలింది.ఆగస్ట్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో రాత్రిపూట జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలపై బహిరంగ విచారణలో ఆ వ్యక్తి సాక్ష్యమిస్తున్నప్పుడు ఈ విషయం బయటపడింది.
ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం నాడు గాజా స్ట్రిప్‌లో తమ సైనికులలో 21 మంది మరణించినట్లు ప్రకటించింది, ఇది హమాస్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్ బలగాలపై అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు
తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరంపై ఉక్రేనియన్ దళాలు కాల్పులకు దిగడంతో 27 మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. డొనెట్స్క్ ప్రాంతానికి రష్యా నియమించిన అధిపతి డెనిస్ పుషిలిన్ ఈ విషయాన్ని తెలిపారు.