Last Updated:

Nobel Economics Prize: ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం

ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్‌ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతికి ఎంపిక చేసింది.

Nobel Economics Prize: ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం

Nobel Economics Prize:  ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్‌ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతికి ఎంపిక చేసింది.

హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌..(Nobel Economics Prize)

క్లాడియా గోల్డిన్‌ అమెరికాకు చెందిన ప్రముఖ లేబర్ ఎకనమిస్ట్‌. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహిళా శ్రామిక శక్తి, సంపాదనలో లింగ వ్యత్యాసం, ఆదాయ అసమానత, సాంకేతిక మార్పు, విద్య, వలసలతో సహా అనేక రకాల అంశాలపై ఆమె పరిశోధన చేశారు. 1990ల్లోనే హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ క్లాడియా గోల్డిన్‌. మహిళా ఆర్థిక శక్తిపై ఆమె ఎనలేని పరిశోధన చేశారు.

నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్‌ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించింది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్‌ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్‌ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు.