Last Updated:

Nirav Modi: బ్రిటన్ కోర్టు ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేవంటున్న నీరవ్ మోదీ

:ప్రముఖ వజ్రాల వ్యాపారి నీవర్‌మోదీ బ్రిటన్‌లో కోర్టు ఫీజులు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదంటూ వాపోతున్నాడు. భారత చట్టాల నుంచి తప్పించుకు తిరుగుతున్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టుల్లో పిటిషన్‌ వేశాయి.

Nirav Modi: బ్రిటన్ కోర్టు ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేవంటున్న నీరవ్ మోదీ

Nirav Modi:ప్రముఖ వజ్రాల వ్యాపారి నీవర్‌మోదీ బ్రిటన్‌లో కోర్టు ఫీజులు చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదంటూ వాపోతున్నాడు. భారత చట్టాల నుంచి తప్పించుకు తిరుగుతున్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని దర్యాప్తు సంస్థలు కోర్టుల్లో పిటిషన్‌ వేశాయి. ఆయనపై బ్రిటన్‌ కోర్టుల్లో బ్యాంకులను మోసం చేయడంతో పాటు మనీలాండరింగ్‌ కేసులపై విచారణ జరుగుతోంది. అయితే మేజిస్ట్రేట్ అతడిని కోర్టు ఖర్చుల కింద లక్షా 50వేల పౌండ్లు చెల్లించాలని ఆదేశించారు. భారతీయ కరెన్సీ ప్రకారం కోటీ 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంత డబ్బు తన వద్ద లేదని, ఇతరుల నుంచి అప్పు తీసుకొని చెల్లించాల్సి వస్తోందని మొరపెట్టుకుంటున్నాడు.

లండన్  జైలులో ఉన్న నీరవ్ మోదీ..(Nirav Modi)

52 ఏళ్ల  నీరవ్గ మోదీ త ఏడాది బ్రిటన్‌లో అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఓడిపోయాడు. ఇండియాలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రెండు బిలియన్‌ డాలర్లు మోసం చేశాడన్న కేసులో దర్యాప్తు సంస్థలు నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలన్న కేసులో నీరవ్‌ కేసు ఓడిపోయాడు. అయితే ఆయనను తక్షణమే భారత్‌కు అప్పగించకుండా కేసును పెండింగ్‌లో ఉంచింది. కాగా నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అయితే జైలు నుంచే ఆయన గురువారం బార్కింగ్‌సైడ్‌ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణలో పాల్గొన్నారు. అయితే లండన్‌ హైకోర్టు ఆయనకు న్యాయపరమైన ఖర్చులు ఫైన్‌లు కలిసి మొత్తం 1 లక్ష 50వేల 247 పౌండ్లు చెల్లించాలని ఆదేశించింది.

అప్పు చేసి కోర్టు ఫీజులు చెల్లిస్తాను..

మేజిస్ట్రేట్ అప్పగింత అప్పీలుకు సంబంధించి ఫైన్‌లు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. నెలకు పది వేల పౌండ్లు చొప్పున ఆరు నెలల పాటు చెల్లించేందుకు మేజిస్ట్రేట్ అనుమతించారు. ఈ డబ్బును ఎలా సమకూరుస్తారని ప్రశ్నించగా.. తన మిత్రుల నుంచి అప్పులు తీసుకుని చెల్లిస్తానని చెప్పాడు. కాగా ఇండియాలో తన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు అన్నీ స్తంభింపజేశారని నీరవ్‌ కోర్టు తెలిపాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బ్రిటన్‌ హోం ఆఫీస్‌ వర్గాల సమాచారం ప్రకారం రాజకీయ శరణార్థిగా బ్రిటన్‌లో ఉండే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కాగా చివరగా లండన్‌ హైకోర్టులో గత ఏడాది నవంబర్‌లో అప్పగింత తుది విచారణ జరిగింది. నీరవ్‌ మానసిక స్థితి సరిగా లేదని.. ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఉంటుందని.. కాబట్టి ఆయనను భారత్‌కు పంపరాదని అతని తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే జస్టిస్‌ జెరెమి స్టూవర్ట్‌ స్మిత్‌, జస్టిస్‌ రాబర్ట్‌ జేలు మోదీ మానసిక స్థితి బాగానే ఉందని తేల్చేశారు.

ఇదిలా ఉండగా భారత్‌లో నీరవ్‌కు అన్నీ రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తుందని లండన్‌ కోర్టులో హామీ ఇచ్చింది భారత దర్యాప్తు సంస్థలు. ఆయనకు ముంబైలోని అర్థర్‌ రోడ్‌ జైల్లోని బారాక్‌ 12లో అన్నీ రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి లండన్‌ కోర్టు కూడా అంగీకరించింది. కాగా మార్చి 2019లో లండన్‌లో నీరవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అటు తర్వాత నుంచి ఆయనను భారత్‌కు అప్పగించాలని భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ లండన్‌ కోర్టులో పిటిషన్‌లు వేశాయి. వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి సామ్‌ గూజీ ఏప్రిల్‌ 2021లో నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలన్న రూలింగ్‌ ఇచ్చారు. తర్వాత బ్రిటన్‌ హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌ కూడా నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని ఆదేశించారు. కాగా నీరవ్‌ వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పును లండన్‌ హైకోర్టులో సవాలు చేశారు.