Last Updated:

Mangalavaaram Movie : పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ టీజర్ రిలీజ్.. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే ?

టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి - పాయల్ రాజ్‌పుత్ తో చేస్తున్న సినిమా "మంగళవారం".  ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మాణంలో ఈ మూవీ తెరేకెక్కుతుండగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Mangalavaaram Movie : పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ టీజర్ రిలీజ్.. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే ?

Mangalavaaram Movie : టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి – పాయల్ రాజ్‌పుత్ తో చేస్తున్న సినిమా “మంగళవారం”.  ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మాణంలో ఈ మూవీ తెరేకెక్కుతుండగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మూవీపై అంచనాలు క్రియేట్ చేయగలిగారు. అర్ధనగ్నంగా ఉన్న పాయల్‌ రాజ్‌పుత్‌ పోస్టర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. పోస్టర్‌లో పాయల్‌ వేలిపై సీతాకోకచిలుక, కంట్లో నీళ్లు కనిపించాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ను అందించారు మేకర్స్.

తాజాగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ తో మూవీపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి. (Mangalavaaram Movie) టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ ఉత్కంఠ రేపే విధంగా సాగింది. ఇక టీజర్ విషయానికి వస్తే.. టీజర్ ప్రారంభంలో అరటితోటలో ఓ జంట చనిపోయి ఉన్నట్టు చూపించారు. అక్కడే పైన ఆకాశంలో సీతాకోకచిలుకలు గుంపుగా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. తర్వాత ఓ అమ్మవారి ఆలయాన్ని చూపించారు. కాగా ఊరి ప్రజలంతా ఆకాశం వైపు భయంతో చూడటం చూపించారు. తర్వాత పాయల్ రాజ్ పుత్ హాట్ సీన్ లో ఉండగానే బిగ్గరగా అరుస్తున్నట్టు ఎమోషన్స్ సీన్స్ లోనూ చూపించారు. టీజర్ లో ఓ వ్యక్తి అమ్మవారి రూపంలో ఉన్న ఫేస్ మాస్క్ ను తీసుకుంటున్నట్టు చూపించారు. అసలు ఆ ఊరి జనాలు ఆకాశంవైపు ఎందుకు చూస్తున్నారు? ఇంతకీ ఆ మాస్క్ ధరించేది ఎవరు.. వంటి సస్పెన్స్ అంశాలు ఇంటరెస్టింగ్ గా మారాయి.

మొదటి సినిమాలో పాయల్ తో లవ్, రొమాన్స్ చూపించిన అజయ్ భూపతి ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ తో భయపెట్టబోతున్నాడని అర్ధమవుతుంది. దాదాపు ఐదేళ్ల కిందట ఈయన తెరకెక్కించిన ఆర్ఎక్స్ – 100 చిత్రం ఒకేసారి అజయ్ కి, హీరో కార్తికేయకి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఆ మూవీ భారీ హిట్ అందుకోవాడమే కాకుండా యూత్ లో ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగింది. ఈ సినిమా తోనే పాయల్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పాయల్ కొంచెం బోల్డ్ గానే నటించింది. పాయల్ కి ఈ సినిమా బాగా పేరు తీసుకురావడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత “మహాసముద్రం” సినిమాతో వచ్చిన అజయ్ భూపతి ప్రేక్షకులను నిరాశ పరిచాడు. దాంతో ఈసారి (Mangalavaaram Movie) కసితో గట్టిగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.