Home / సినిమా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్-టు-బ్యాక్ టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా పుష్ప క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇప్పుడు ప్రకటనలకు రెడీ అవుతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమాలలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరు. మహేష్ గతేడాది నుంచి టీవీ ప్రమోషన్స్‌లో కూడా ఉన్నాడు. అతను ఇటీవల జీ తెలుగుతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు మరియు అతనికి 9 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా అనుమానాస్పద మృతి చెందారు. ఈ ఘటన గుజారాత్‌లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతి పై పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు విషయాల్లోకి వెళ్తే గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పదంగా మృతి చెందారు.
సంచిత బషు మన అందరికీ పరిచయమున్న ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఒకప్పుడు సంచిత బషు టిక్ టాక్ వీడియోస్ తో పేరును, మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. రీసెంటుగా ఈమె ఓ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ప్రస్తుతం తరుణ్ గురించి ఒక వార్తా సోషల్ మెడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని అది కూడా కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నారని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి.
కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్.. సెప్టెంబర్ 4న సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్‌గా మొదలు కానుంది. ఈ నేపధ్యంలో కంటెస్టెంట్లు ఎవరనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
కొంతమంది సెలబ్రిటీలకు మొదట్లో చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. కానీ వారి సినిమాల్లో ఒకటి క్లిక్ అయితే, వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ సమయంలోనైనా పెరుగుతుంది. ’సీతారామం‘ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గత 10 సంవత్సరాలలో, ఈ బ్యూటీ టీవీ సీరియల్స్ మరియు అనేక చిత్రాలలో పాత్రలు చేస్తూ దాదాపు 4.5+ మిలియన్ల మంది ఫాలోవర్లతో బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది,
విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాధ్ ల లైగర్ ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా దూసుకుపోతోంది. మౌత్ టాక్ సరిగా లేకపోవడంతో వీకెండ్ కూడా సినిమాకు హెల్ప్ కాలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. చాలా ప్రాంతాలలో పూరీ జగన్నాధ్ థియేట్రికల్ డీల్స్ నిర్వహించాడు.
నటుడు విశాల్ 33వ చిత్రానికి మార్క్ ఆంటోని అని నామకరణం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన విశాల్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది, ఇందులో విశాల్ సరికొత్త మేకోవర్‌లో కనిపించాడు.
పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సీక్వెల్లో కూడా ప్రధాన తారాగణం వారి వారి పాత్రలను వారే పోషిస్తారు. ఇలా ఉంటే, ఈ సినిమా కోసం నిర్మాతలు మరో విలన్ ను ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.