Published On:

Vijay Deverakonda: హీరో విజయ్‌ దేవరకొండపై కేసు.. ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ!

Vijay Deverakonda: హీరో విజయ్‌ దేవరకొండపై కేసు.. ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ!

SC, ST Atrocity Case Filed on Hero Vijay Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై కేసు కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో రాయదుర్గం పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

ఇదిలా ఉండగా, మే 26న తమిళ్ స్టార్ హీరో నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హాజరై ప్రసంగించారు. ఇందులో భాగంగానే పహల్గామ్ దాడి విషయంపై మాట్లాడారు. పాకిస్తాన్ దేశంపై భారత్ దాడి చేాయాల్సిన అవసరం లేదని, ఆ దేశ ప్రజలే విరక్తితో వాళ్లనే అటాక్ చేసుకుంటారన్నారు.

 

అంతేకాకుండా విద్యుత్, వాటర్ తదితర ఇబ్బందులు కొనసాగితే 500 ఏండ్ల క్రితం ట్రైబల్స్ దాడి చేసుకున్నట్లు పని, ఆలోచన లేకుండా గొడవపడుతున్నారన్నారు. కానీ భారత్ లో అందరూ సమష్టిగా కలిసి ఉండాలని సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆదివాసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆదివాసులను విజయ్ అవమానపరిచారని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు ఆదివాసీల కల్చర్ దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి: