Last Updated:

Adipurush : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ 10,000.. రణ్‌బీర్ కపూర్ 10,000 .. ఆదిపురుష్ టికెట్స్ బుకింగ్.. రీజన్ ఏంటంటే..?

Adipurush : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ 10,000.. రణ్‌బీర్ కపూర్ 10,000 .. ఆదిపురుష్ టికెట్స్ బుకింగ్.. రీజన్ ఏంటంటే..?

Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం  “ఆదిపురుష్”. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో అందరూ హర్షం వ్యక్తం చేసే కార్యక్రమానికి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ శ్రీకారం చుట్టారు.

ఆదిపురుష్ సినిమా టిక్కెట్లను 10 వేల మందికి పైగా ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి (Adipurush) టిక్కెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు ‘సెలబ్రేటింగ్ ఆదిపురుష్’ గూగుల్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. వివరాలు నమోదు చేసిన వారికి టిక్కెట్లు పంపిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 95050 34567 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

అలానే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కూడా 10 వేల టికెట్స్ బుక్ చేసుకున్నాడు. నార్త్ లోని పలు ప్రాంతాల్లోని పేద పిల్లలకు ఈ టికెట్స్ ని డొనేట్ చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

 

కాగా ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఓ వినూత్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్, థియేటర్స్ కు సంబంధించి అధికారికంగా ఓ లెటర్ ని విడుదల చేసింది. అందులో.. రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతి గొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆదిపురుష్ ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం అని తెలిపారు.