Last Updated:

Gautham Vasudev Menon: అలాంటి సినిమాలు ఏ హీరో చేయడం లేదు.. డైరెక్టర్లను బండబూతులు తిడుతున్నారు

Gautham Vasudev Menon: అలాంటి సినిమాలు ఏ హీరో చేయడం లేదు.. డైరెక్టర్లను బండబూతులు తిడుతున్నారు

Gautham Vasudev Menon: క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరు కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన సినిమా అంటే ప్రేమ. అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిన్లను ఆయన చూపించే విధానం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ మాయ చేసావే, ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే గౌతమ్ గత కొంతకాలంగా డైరెక్షన్ కంటే ఎక్కువ నటనపై ఫోకస్ చేస్తున్నాడు. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా ఎన్నో మంచి సినిమాల్లో నటించాడు.

ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆయన బెంగుళూరులో జరుగుతున్న బెంగుళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(Bengaluru International Film Festival) కు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. మార్చి 1 నుంచి మొదలైన ఈ వేడుకలు మార్చి 8 వరకు జరగనున్నాయి. ఇక నేడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ వేడుకల్లో పాల్గొన్ని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఎలా ఉన్నది అనేది చెప్పుకొచ్చాడు.

” ఈ మధ్యకాలంలో హీరోలు రొమాంటిక్ మూవీస్ చేయాలనుకోవడం లేదు. నేను ఎంతోమంది హీరోలకు రొమాంటిక్ కథలు చెప్పాలనుకున్నాను. తెలుగు, తమిళ్, కన్నడ.. ఇలా అన్ని భాషల్లో స్టార్ హీరోలకు కాల్ చేసి మీకో రొమాంటిక్ కథ చెప్పాలనుకుంటున్నాను అనగానే వారు మీటింగ్ ను వాయిదా వేస్తూ వచ్చేవారు. ఇంకొందరు అయితే కలవడానికి ఇష్టపడేవారు కూడా కాదు. వారెందుకు కలవలేదు అనేది మీరు వారినే అడిగి తెలుసుకోండి. నా దగ్గర చాలా  కథలు ఉన్నాయి. అందుకే నేను ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతున్నాను.

Singer Kalpana: కూతురితో మనస్పర్థలు.. అందుకే నిద్ర మాత్రలు వేసుకున్నా!: పోలీసులతో సింగర్‌ కల్పన

ఈ మధ్య ఓటీటీలు వచ్చాకా.. ప్రేక్షకులు థియేటర్ కు రావడం తగ్గించేశారు. వారిని థియేటర్ కు రప్పించడం ఇప్పుడున్న మేకర్స్ కు చాలా పెద్ద ఛాలెంజ్ గా మారింది.  నాకు సినిమాలు తీయాలన్నా.. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలన్నా చాలా ఇష్టం.  అందులోనూ నా సినిమాలన్నీ ప్రయోగాత్మకమైనవే. సూర్య, జ్యోతిక నటించిన కాఖా కాఖా (తెలుగులో ఘర్షణగా రీమేక్ చేశారు). మొదట  ఎవరికి నచ్చలేదు. నెమ్మదిగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ప్రేక్షకులను ఓటీటీ నుంచి థియేటర్ కు రప్పించడానికి కొత్త మార్గాలు కనిపెట్టాలి. అది ఎలా అనేది నాకు కూడా తెలియడం లేదు.

తెలుగు, తమిళ్ ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్ కు రావడం విశేషం. ఒకప్పుడు సినిమాలకు రివ్యూలు ఇచ్చేవారు కేవలం సినిమా గురించి మాత్రమే రాసేవారు. కానీ, ఇప్పుడు రివ్యూలు రాసేవారు సినిమా నచ్చకపోతే పర్సనల్ ఎటాక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో డైరెక్టర్లను బండబూతులు తిడుతున్నారు. డైరెక్టర్ ఒక్కరినే కాదు ఆ సినిమా కోసం పనిచేసిన రచయితను, మిగతావారిని కూడా కలిసి మాటలు అంటున్నారు. అలా అనేవారు ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నాను.

ఇక స్టార్స్ తో సినిమాలు చేసేటప్పుడు ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుంటారా.. ? అంటే నేను అలాంటివి చాలా రేర్ గా చేస్తాను. అజిత్ హీరోగా నటించిన ఎంతవాడు గానీ సినిమా ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ అజిత్ దాన్ని గుర్తుచేకుంటూ ఉంటాడు. మొన్నటికి మొన్న డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటించాడు. అసలు ఆయన స్టార్ అన్న విషయాన్నే నేను మర్చిపోయాను” అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి: