Home / సినిమా వార్తలు
మెగాస్టార్ అభిమానులంతా గాడ్ ఫాదర్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఆచార్య మూవీ మెగాఫ్యాన్స్ ను నిరాశపచడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న గాడ్ ఫాదర్ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ ను వేగంగా చేపడుతుంది. దీనిలో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో వేశారు. మూవీ చూసిన టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారంటా... తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశానని ఆయన తెలిపారు.
చాలా కాలం నుంచి మంచు విష్ణు సరయిన హిట్ లేక, కథలు ఎలా ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్న సమయంలో " జిన్నా" సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురనున్నారు. మా ఎన్నికల్లో గెలిచిన తరువాత మంచు విష్ణు సోషల్ మీడియా కథానాల్లో ఉంటున్నారు.
దర్శకుడు మణిరత్నం గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయాడు. అయితే అతని తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో అతను మరలా రికార్డులు తిరగరాయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు కమల్ హాసన్ మరియు రజనీకాంత్ ప్రారంభించారు.
మాస్ మహారాజ రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసురుడు సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుధీర్ వర్మ వర్కింగ్ స్టైల్‌తో ఇంప్రెస్ అయిన రవితేజ అతనికి దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చాడు.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం పై గత కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను, క్రిష్ వంటి దర్శకుల పేర్లు ఊహాగానాలు జరిగాయి. కానీ ఏ ఒక్కటీ కన్ ఫర్మ్ కాలేదు. ఇప్పుడు అతని అరంగేట్రం గురించి మరలా వార్తలు వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం లూసిఫర్‌కి రీమేక్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజీత్ తో కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని మరియు పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండడం కనిపిస్తుంది. తన అప్డేట్ అన్నీ అభిమానలతో నెట్టింట పంచుకుంటారు. అయితే ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా, ఇన్ స్టా వేదికగా జాన్వి చేసిన డ్యాన్స్ ఇప్పుడు కుర్రకారులో జోరుపుట్టిస్తుంది.
బాలీవుడ్ జంట అలియా భట్ మరియు రణబీర్ కపూర్లు కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో వీరిరువురు మంగళవారం రాత్రి ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయానికి దర్శనానికి వచ్చారు. అయితే వీరిని గుడిలోకి ప్రవేశించకుండా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.