Last Updated:

Chhaava: ఛావా తెలుగు రిలీజ్‌కి షాక్‌! – అక్కడ మూవీని నిలిపివేయాలని డిమాండ్‌!

Chhaava: ఛావా తెలుగు రిలీజ్‌కి షాక్‌! – అక్కడ మూవీని నిలిపివేయాలని డిమాండ్‌!

Chhaava Telugu Release Controversy: బాలీవుడ్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌ విక్కీ కౌశల్‌, నేషనల్‌ రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం ‘ఛావా’. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం లవర్స్‌ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్లు వసూళ్లు చేసి విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. కేవలం హిందీలోనే విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.  టాలీవుడ్‌ అగ్ర నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్‌ ఛావాను తెలుగు రైట్స్‌ తీసుకుని నేడు మార్చి 7న ఇక్కడ థియేటర్లలో విడుదల కానుంది.

చరిత్రను వక్రీకరించారు

రేపు ఛావా తెలుగులో విడుదల ఉండగా తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ నెల్లూరుకి చెందిన ముస్లింలు మూవీపై అభ్యంతర వ్యక్తం చేస్తూ ఛావా రిలీజ్‌ను నిలివేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మూవీ రిలీజ్‌ని ఆపాలంటూ ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జియా ఉల్ హకీ అక్కడి జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందించినట్టుగా తెలుస్తోంది. ఛావాను తెలుగులో రిలీజ్‌ చేస్తే మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, ఈ సినిమా చరిత్రకి సంబంధం లేకుండ ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాలో 16వ శతాబ్దం నాటి ఔరంగజేబుని క్రూరుడిగా చూపించారని చెబుతున్నారు.

ఘర్షణలు జరిగితే..

ఛావా రిలీజ్‌ తర్వాత ఉత్తర భారతదేశంలో ఘర్షణలు జరిగినట్టు ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉందని, అందుకే మూవీ రిలీజ్‌ ఆపాలని కోరుతూ వినతి పత్రం అందించినట్టు తెలుస్తోంది. మరి ఈ మూవీ రిలీజ్ విషయంలో అక్కడ ఏం జరుగనుందని ఆసక్తి నెలకొంది. కాగా శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో హిస్టారికల్‌ చిత్రంగా రూపొందింది. మూవీకి ముస్లిం ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వచ్చినా ఈ సినిమా మాత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోయింది. రోజురోజుకు కలెక్షన్స్‌ పెంచుకుంటూ హిందీ బాక్సాఫీసు వద్ద దండయాత్ర చేసింది. ఛత్రపతి శివాజీ తనయుడి కథగా హిస్టారికల్‌ మూవీగా వచ్చిన ఛావా చూసేందుకు ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టారు. కేవలం హిందీలో ఈ సినిమా దాదాపు రూ. 500 కోట్ల కలెక్షన్స్‌ చేసి విక్కీ కౌశల్‌ కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.