Last Updated:

Anurag Kashyap: హిందీ ఇండస్ట్రీ విషపూరితమైంది – అందుకే బాలీవుడ్‌ని వదిలేస్తున్నా, స్టార్‌ డైరెక్టర్‌

Anurag Kashyap: హిందీ ఇండస్ట్రీ విషపూరితమైంది – అందుకే బాలీవుడ్‌ని వదిలేస్తున్నా, స్టార్‌ డైరెక్టర్‌

Anurag Kashyap Confirms He Left Bollywood: ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్ షాకింగ్‌ ప్రకటన చేశాను. తాను బాలీవుడ్‌ని వీడుతున్నట్టు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో హాట్‌టాపిక్‌గా మారింది. అనురాగ్‌ కశ్యప్‌ తాజాగా ది హిందు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందీ ఇండస్ట్రీ విషపూరితంగా మారిందన్నారు. అందుకే బాలీవుడ్‌ని వదిలేస్తున్నట్టు స్పష్టం చేశారు.

టాక్సిక్ బాలీవుడ్..

“బాలీవుడ్‌ పరిశ్రమ చాలా దారుణంగా తయారైంది. అందుకే హిందీ పరిశ్రమను వదిలేద్దామని డిసైడ్‌ అయ్యాను. ఇక్కడ సాధ్యం కానీ లక్ష్యాల వెంట పరుగులు పెడుతున్నారు. ఒక సినిమా చేస్తున్నామంటే అది కనీసం రూ. 500 కోట్లు, రూ. 800 కోట్లు కలెక్షన్స్‌ వచ్చేలా ఉండాలంటున్నారు. ఈ క్రమంలో క్రియేటివిటీ పడిపోతుంది. నా నిర్మాతలు నాతో సినిమా చేసేందుకు భయపడుతున్నారు. అంతా లాభాల కోసమే చూస్తున్నారు. ఒక సినిమా కోసం వెళితే మొదట లాభం ఎంత అని అడుగుతున్నారు.

నిర్మాతలు దారుణంగా తయారయ్యారు

‘నా మార్జిన్‌ ఎంత? నేను డబ్బులు పొగోట్టుకుంటాను?, ఈ సినిమా వర్కౌట్‌ అవుతుందా? ఇది చేయడం అవసరమా?’ అంటున్నారు. ఇంకా కొందరైతే సినిమా మొదలు పెట్టముందే ఎలా అమ్మాలి? అని ఆలోచిస్తున్నారు. దీనిక వల్ల ఓ ఫిలిం మేకర్‌గా.. డైరెక్షన్‌ని ఆస్వాధించలేకపోతున్నారు. అందుకే నేను ఈ టాక్సిక్‌ ఇండస్ట్రీని వదిలిపెట్టాలనుకుంటున్నా. వచ్చే ఏడాదిలో ముంబై వదిలేసి పర్మినెంట్‌గా బెంగళూరుకి షిఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నా” అని చెప్పుకొచ్చారు. కాగా అనురాగ్‌ కశ్యప్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది.

ఇంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన బాలీవుడ్‌ని టాక్సిక్‌ అని పిలవడంతో చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనురాగ్‌ కశ్యప్‌ అడివి శేష్‌ డకాయిట్‌లో నటిస్తున్నారు. ఇందులో ఆయన పవర్ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ స్వామి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ఆయన లుక్‌ పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేస్తూ పాత్రను పరిచయం చేశారు. అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి షానిల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు.