Last Updated:

Horoscope Today :రాశి ఫలాలు(బుధ వారం అక్టోబర్  05 , 2022 )

Horoscope Today : రాశి ఫలాలు (బుధ వారం అక్టోబర్  05 , 2022 )

Horoscope Today :రాశి ఫలాలు(బుధ వారం అక్టోబర్  05 , 2022 )

Horoscope Today : రాశి ఫలాలు (బుధవారం అక్టోబర్  05 , 2022 )

1. మేష రాశి

ఈ రోజు మీ స్నేహితుని వల్ల మానసిక చికాకు కలుగుతుంది.మీరు ఈ సమస్య నైనా దైర్యంగా ఎదుర్కోవాలి.మీ ప్రియమైన వారి వల్ల మీరు బాధ పడతారు.మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచిగా ఉండదు. ఈ రోజు పనిలో ఈ రోజు మునిగిపోతారు . మీ సంపాదన తగ్గే  అవకాశం ఉంది. ఆఫీసులో పని చేసే వాళ్ళలో ఒకరు మీకు  ద్రోహం  చేస్తారు. ఈ రోజు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి .

2 . వృషభ రాశి

ఎప్పుడు అదృష్టం పైనే ఆధారపడకండి. మీ  ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. మీ ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు  చేస్తారు. మీరు చేసే నిర్లక్ష్యం వల్ల మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి  చేస్తుంది. ఆఫీసులో ప్రేమ వ్యవహారాలు నడపడం వల్ల , మీ యొక్క పేరు చెడిపోయే అవకాశం ఉంది. ఈ రోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఈ రోజు మీ భాగస్వామి తో సంతోషంగా గడుపుతారు.

3. మిథున రాశి

మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. మీ భాగస్వామి సాయం తీసుకుంటారు. మీరు అనుకున్న పనులు చేయడానికి ఇదే మంచి అవకాశం . ఈ రోజు మీకు గుర్తు ఉండిపోతుంది. మీకు ఇష్టమైన వారికి మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు ఎంత బిజీ గా ఉన్న మీ పిల్లలతో కొంత సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలో మీరు కొన్ని కోల్పోతారు . మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడుతుంది . మీ భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండండి

5. సింహ రాశి

ఈ రాశి వారికి రోజులోని రెండో భాగంలో ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ సమయాన్ని  వృధా చేస్తున్న స్నేహితులకు దూరంగా ఉండండి.  మీ జీవితంలో మీరు చాలా బాధలు పడాలిసి వస్తుంది. మీ భాగస్వామిని అర్దం చేసుకోండి .. ప్రతి చిన్న దానికి ఆమెతో గొడవలు పడకండి.

6. కన్యా రాశి

ఆరోగ్యం పట్ల తగిన  జాగ్రత్తలు పాటించండి.  ఈ రాశికి చెందిన వారు  ఈ రోజు డబ్బును బాగా ఖర్చు చేస్తారు. ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. ఆఫీసులో పని చేసేటప్పుడు జాగ్రతగా ఉండండి. మీ స్నేహితులను కలుసుకుంటారు. మీ జీవితం గురించి ఒకసారి ఆలోచించుకోండి. సరియైన సమయంలో మీ పనులన్ని పూర్తి చేస్తారు. పెళ్ళి గురించి సరియైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రోజు మీ జీవిత  భాగస్వామి మీ కోసం ఏదైనా స్పెషల్ చేస్తారు.

7. తుల రాశి

పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టండి. ఈ రోజు మీకు కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. స్నేహితులతో మీ బాధలను పంచుకోండి. నమ్మకమైన స్నేహితులు మీ జీవితంలోకి వస్తారు. మీరు అనుకున్న ఫలితాలు రావు. మీ బంధువులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి . ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

8. వృశ్చిక రాశి

మీరు ఎన్ని బాధల్లో ఉన్నా చిరునవ్వు చెరగదు. డబ్బులు ఎలా పొదుపు చేయాలో నేర్చుకోండి. మీ కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించండి.
మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. మీరు చేయలకున్న పనులను కొన్ని కారణాల వల్ల చేయలేరు. మీ వైవాహిక జీవితం అందంగా ఉండబోతుంది.

9.ధనస్సు రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బావుంటుంది. డబ్బును బాగా పొదుపు చేయండి. ముందు ముందు మీకు డబ్బు చాలా నేర్పిస్తుంది. మీ జీవితంలో డబ్బు వల్ల ఇబ్బందులు తప్పవు. కొత్త పనులను ప్రారంభిస్తారు . అనుకోకుండా ప్రయాణాలు చేయాలిసి వస్తుంది. మీ భాగస్వామి మీకు ఈ రోజు దేవత లాగా కనిపిస్తుంది.

10.మకర రాశి

ఈ రోజు మీ చిన్న నాటి  బాల్యం గురించి గుర్తు చేసుకుంటారు. ఈ రోజు మీ  సమయాన్ని అవసరం ఐనా పనులకు కాకుండా అనవసర  పనులకు వృధా చేస్తారు.    ప్రవర్తనలో కొత్త మార్పులు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో మీ బాధలను పంచుకుంటారు. మీ ఇంటికి అతిధులు  రావడం వల్ల మీరు చేయాలనుకున్న పనులను చేయలేరు. మీ సమస్యలకు పరిష్కారం నెమ్మదిగా దొరుకుతుంది. ఈ రోజు  మీ జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలను తెలుసుకుంటారు.

11.కుంభ రాశి

మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు చేయాలకున్న పనులు ఎవరికి చెప్పకండి. ఒక వేళ ఎవరికైనా చెప్తే మీ పనులు ముందుకు వెళ్లవు. ఈ రోజు మీకు ఇంత వరకు లభించని  అదృష్టాలు కలిసి రానున్నాయి.  మీతో మీరు కొంత సమయాన్ని గడువుతారు.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన స్నేహితులతో  సంతోషంగా ఉంటుంది.

12. మీన రాశి

ఆరోగ్యం నుంచి కోలుకునే  అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ రోజు మీరు ఒక శుభ వార్తను వింటారు. మీరు పని చేసే ఆఫీసులో మంచి పేరు వస్తుంది.  ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీరు ఏ పని చేసిన మీ ఇంట్లో వారికి చెప్పి చేయండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా డబ్బును ఖర్చు చేస్తారు.

ఇవి కూడా చదవండి: