Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల వారికి పెళ్లి సంబంధం కుదురుతుందని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది అని తెలుస్తుంది. అలాగే మార్చి 19 వ తేదీన  రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల వారికి పెళ్లి సంబంధం కుదురుతుందని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల వారికి పెళ్లి సంబంధం కుదురుతుంది అని తెలుస్తుంది. అలాగే మార్చి 19 వ తేదీన  రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

కుటుంబ సంబంధమైన ఒకటి రెండు ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొందరు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం..

ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. కొన్ని వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా సానుకూలంగా పరిష్కారం అవుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మిథునం..

ఉద్యోగ జీవితం ఎ టువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. ఒక ప్రధానమైన రుణ సమస్య నుంచి అనుకోకుండా బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. హామీలు ఉండటం, వాగ్దానాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండండి. ప్రేమలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం..

ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పిల్లలకు సంబంధించిన సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

సింహం..

ఉద్యోగంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు చదువుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. ఆహార విహారాల్లో క్రమశిక్షణ అవసరం. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు రెండు మూడు ఆఫర్లు వస్తాయి. స్నేహితురాలితో కలిసి వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

కన్య..

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ పరంగా దూరప్రాంతం నుంచి మంచి సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. స్నేహితురాలితో విహారయాత్ర చేసే అవకాశం ఉంది.

తుల..

ఆర్థిక విషయాలలో సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎదిగే సూచనలు ఉన్నాయి. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటి వంటి వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. సామాజిక రంగంలోని వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఈ రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు (Daily Horoscope)..

వృశ్చికం..

అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఒకదానికి పరిష్కారం కనిపిస్తుంది. స్నేహితురాలి మీద బాగా ఖర్చవుతుంది. ఇతరులకు బాగా ప్రయోజనం కలిగించే పనులు చేస్తారు.

ధనుస్సు..

ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఎంతో ఉదారంగా సహాయం చేస్తారు. బందు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.

మకరం..

పెళ్లి సంబంధం విదేశాల నుంచే వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న బాకీ ఒకటి వసూలు అవుతుంది. పిల్లలు చదువుల్లో అభివృద్ధి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. స్నేహితురాలికి విందు ఏర్పాటు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

కుంభం..

కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు కనిపిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రాంతంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది.

మీనం..

కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఆలోచన చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థుల తేలికగా విజయాలు సాధిస్తారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.