Last Updated:

Today Panchangam : నేటి (మార్చి 19, ఆదివారం) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి (మార్చి 19, ఆదివారం) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 19 ) ఆదివారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఫాల్గుణం 28, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, క్రిష్ణ పక్షం, ద్వాదశ తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 26, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 19 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ద్వాదశి తిథి ఉదయం 8:08 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ధనిష్ఠ నక్షత్రం రాత్రి 10:04 గంటల వరకు ఉంటుంది. సిద్ధ యోగం ఈరోజు ఉదయం 8:06 గంటల వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ఉదయం 11:17 గంటలకు సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : ప్రదోష వ్రతం

సూర్యోదయం సమయం 19 మార్చి 2023 : ఉదయం 6:26 గంటలకు

సూర్యాస్తమయం సమయం 19 మార్చి 2023 : సాయంత్రం 6:31 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:51 గంటల నుంచి ఉదయం 5:39 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:18 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:05 గంటల నుంచి రాత్రి 12:52 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:29 గంటల నుంచి సాయంత్రం 6:53 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 12:43 గంటల నుంచి మధ్యాహ్నం 2:09 గంటల వరకు

(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : సాయంత్రం 4:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

గులిక్ కాలం : తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 4:30 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

దుర్ముహర్తం : సాయంత్రం 4:55 గంటల నుంచి సాయంత్రం 5:43 గంటల వరకు