Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకి సంబంధించి శుభవార్త వింటారని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకి సంబంధించి శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 19 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకి సంబంధించి శుభవార్త వింటారని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పిల్లలకి సంబంధించి శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 19 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులు కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఆర్థిక వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.

వృషభం..

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మిథునం..

నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను ముందే పూర్తి చేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నం సఫలం అవుతుంది. వివాహ ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. సతీమణితో అన్యోన్యత పెరిగే సూచనలు న్నాయి.

కర్కాటకం..

నిరుద్యోగులు శుభవార్త వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి.

సింహం..

తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఒత్తిడి తగ్గు తుంది.

కన్య..

కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

తుల..

రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబపరంగా ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో తల్లితండ్రుల సహాయం చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.

వృశ్చికం..

రావలసిన బాకీలు వసూలు అవుతాయి. సన్నిహితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది.

‍ధనస్సు..

వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడానికి ఇది సమయం కాదు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఒకటి, రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.

మకరం..

వృత్తి, వ్యాపారాలు చురుకుగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది.

కుంభం..

రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చవద్దు.

మీనం..

పిల్లలకి సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో విహార యాత్ర లకు ప్లాన్ చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది.