Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ముఖ్యమైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ముఖ్యమైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే జూలై 11 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ముఖ్యమైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ముఖ్యమైన పనుల విషయంలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే జూలై 11 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

ముఖ్యమైన పనుల్ని వేగంగా పూర్తి చేస్తారు. పెండింగ్ పనుల నుంచి బయటపడతారు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాలలో ధన లాభం ఉంది. ఇతరుల విషయాలలో తలదూర్చకపోవడం మంచిది. కొత్త ఉద్యోగావకాశాలను వినియోగించుకోవడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది.

వృషభం..

ఆస్తికి సంబంధించిన వివాదాలు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహాలతో పదోన్నతికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యత మరింతగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మిథునం..

వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలు నిర్వహిస్తారు. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.

కర్కాటకం..

ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఇంట్లో శుభ కార్యం చేసే అవకాశం ఉంది. వ్యాపారం ఆశాజనకంగా ముందుకు సాగుతుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను సంప్రదించడం వల్ల ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం..

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి రావచ్చు. అధికారులతో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వాతావరణం సామాన్యంగా సాగిపోతుంది. పిల్లల చదువులు, ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సంతృప్తి చెందాల్సి వస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కన్య..

ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగించవచ్చు.

తుల..

ఆర్థికపరంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఒకటి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలూ లేకుండా పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా, సాఫీగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి.

వృశ్చికం..

ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పైకి ఎదిగే సూచనలున్నాయి. అధికారుల నుంచి సహాయం అందుతుంది. ప్రయాణాల విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది. పిల్లల నుంచి మంచి వార్త వింటారు.

ధనస్సు..

ఉద్యోగ ప్రయత్నం సఫలం అవుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెడితే మంచిది. వృత్తి, వ్యాపారాలలో బిజీ అయ్యే సూచనలున్నాయి. సన్నిహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. పిల్లలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. ఉద్యోగం మారడానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

మకరం..

కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని ముఖ్యమైన పనులు చేయడం మంచిది. బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో, ఉద్యోగాల్లో స్థిరత్వం పొందుతారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి సంబంధించి ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది.

కుంభం..

ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ పని భారం పెరుగుతుంది. పిల్లల్లో ఒకరు చదువుల కోసమో, ఉద్యోగం కోసం దూర ప్రాంతానికి వెళ్లవలసి వస్తుంది. అనారోగ్యానికి సంబంధించి బంధువుల్లో ఒకరి నుంచి దుర్వార్త వినాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగానే సాగిపోతాయి.

మీనం..

ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. వృత్తి జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి సంబంధించి ఒక శుభవార్త అందుతుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చకపోవడం మంచిది.