Home / బిజినెస్
సామ్సంగ్ గెలాక్సీ M53 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.30,000 లోపు ఉంది.6 ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499 గా ఉంది. 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499.ఈ మొబైల్ రూ.30,000 లోపు వచ్చి ఇతర స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కు మంచి పోటీ ఇచ్చింది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,550 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,780 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 65000 గా ఉంది.
భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్ ఈరోజు ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు హోల్‌సేల్ సెగ్మెంట్ కోసం సెంట్రల్-బ్యాంక్-బ్యాక్డ్ డిజిటల్ రూపాయి కోసం పైలట్‌ను ప్రారంభించనుంది. డిజిటల్ రూపాయి - రిటైల్ విభాగంలో మొదటి పైలట్ కస్టమర్లు మరియు వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో ఒక నెలలోపు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆర్ బి ఐ ప్రకటించింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు దాఖలు చేసిన కంపెనీ సమాచారం ప్రకారం, ఎలోన్ మస్క్ సోమవారం ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించి, తనను తాను ఏకైక సభ్యునిగా ప్రకటించుకున్నారు
దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో భారీ రాబడిని కొనసాగిస్తున్నాయి. అక్టోబర్ నెలకు గాను రూ. 1,51,718 కోట్లు వసూలైన్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ రెండింటిపై రూ.40 పైసలు తగ్గించినట్లు ప్రకటించింది. తగ్గిన ధరలు నేడు అనగా మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి రానున్నట్టు తెలిపింది.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఏడాది ప్రతిపాదికన 22 నుంచి 26 శాతం పెరిగాయని,అక్టోబర్ మొదటి నెలవారీ పెరుగుదల ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్ కంపెనీ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్లో ఆయన గతరాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు వింత అనుభవం ఎదురైయ్యింది. సోమవారం నాడు చాలామంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ అకౌంట్లు సరైన వార్నింగ్ లేకుండానే డిలీట్ అయ్యాయని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా చాలా మంది యూజర్లు ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,840 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 63000 గా ఉంది.