Home / బ్రేకింగ్ న్యూస్
పార్లమెంట్ ప్రవాస్‌యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేటి నుంచి మూడురోజులపాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు బీజేపీ వెల్లడించింది.
భారత నౌకాదళానికి సరికొత్త పతాకం లభించనుంది. బ్రిటిష్ కాలం నాటి గుర్తులతో ఉన్న ప్రస్తుత పతాకాన్ని త్వరలో మార్చనున్నారు. భారత్‌లోనే పూర్తిగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఈ సరికొత్త పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆయన కడప జిల్లాలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఇబ్రాహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
పాకిస్థాన్‌లో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలతో ముంచేసింది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతాల్లో వరదలు వల్ల అన్ని మునిగిపోయాయి. వరదల వల్ల వెయ్యికి పైగా మృతి చెందగా మూడు కోట్ల మంది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
జార్ఖండ్‌లో అధికార జెఎంఎం పార్టీ, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌కు మకాం మార్చింది.
సోషల్ మీడియాలో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న ఎంఐఎం నేత కషఫ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో సయ్యద్ అబ్దుల్ ఖాద్రీ అలియాస్ కషఫ్ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కేఆర్కే అని పిలువబడే నటుడు కమల్ ఆర్ ఖాన్‌ను మంగళవారం ఉదయం ముంబయ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని బోరివాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కేఆర్కే తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్‌ల కారణంగా అరెస్టు చేయబడ్డాడు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెడుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ
ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు