Home /Author Jaya Kumar
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపు పాలనను ఎండగట్టేలా యువత గళం విప్పాలని జనసేన పిలుపునిస్తోంది. దిక్కులు పిక్కటిళ్లేలా జనసేన సమక్షంలో నీ గళం వినిపించు అని కోరుతున్నారు. ’’25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికి జనసేన ఉంది‘ అంటున్నారు.
‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ధియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు హడావిడి చేశారు. కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు.
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ థియేటర్లో ఈరోజు బాలకృష్ణ అభిమానుల్లో ఓ తాత చేసిన సందడి సోషల్ మీడియాలో ఇప్పుడు హైలైట్ గా మారింది. బాలయ్య పాటకు అదిరిపోయే రేంజ్ లో థియేటర్లోనే స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేశాడు. ఆ పెద్దాయన డాన్స్ వీస్తూంటే యూత్ అంతా ఆయనను సపోర్ట్ చేస్తూ ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా అద్భుతంగా నటించాడు. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు.
ఎంతో ఫినామినా క్రియేట్ చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) సమాధానం చెబుతూ.. సినిమా విడుదలై ఇంత గొప్ప ఆదరణ పొందినప్పుడు, మాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది.