Home /Author Jaya Kumar
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఇంఛార్జి అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్ "భారత చైతన్య యువజన పార్టీ" లోకి చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బొడే రామ చంద్ర యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ ను పార్టీ లోకి ఆహ్వానించారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బస్సు ప్లాట్ 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. దీంతో పలువురు ప్రయాణికులు పైకి బస్సు వెళ్లడంతో చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొంతమందికి గాయాలు అయ్యాయి.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. తాజాగా, బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (నవంబర్ 06, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,500 లు ఉంటే..
హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులకు ధీటుగా న్యాయవాదులు పోరాడారని మంత్రి గుర్తుచేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఇప్పటికే రెండో జాబితాల్లో 63 మంది సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు. మొదటి జాబితాలో 20 మంది.. రెండో జాబితాలో 43 మంది అభ్యర్ధులను ప్రకటించారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా చేస్తున్నారు.
"ప్రియా ప్రకాష్ వారియర్".. గురించి కొత్తగా తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోస్ తో యూత్ అందర్నీ ఫిదా చేస్తుంది. ఆ ఫోటోస్ ని మీరు కూడా ఓ లుక్కేయండి..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ తో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఉదయం నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని వచ్చారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి దేశ వ్యాప్తంగా కోట్లలో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆయన సినిమా రిలీజ్ అయినా, బర్త్ డే అయినా ఫ్యాన్స్ అందరికీ ఓ పండుగ అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ 59వ బర్త్ డే జరుపుకున్నారు. నవంబర్ 2న ఆయన 58 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ప్రతి ఏడాది
ఏపీలో తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నేటి సమాజంలో రోజురోజుకీ మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి తప్ప తగగడం లేదు అనడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతిని.. ప్రేమ పేరుతో నమ్మించిన