Last Updated:

BCY Party : బీసీవై పార్టీలో చేరిన కాంగ్రెస్ కీలక నేత అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్..

ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఇంఛార్జి అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్ "భారత చైతన్య యువజన పార్టీ" లోకి చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బొడే రామ చంద్ర యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ ను పార్టీ లోకి ఆహ్వానించారు.

BCY Party : బీసీవై పార్టీలో చేరిన కాంగ్రెస్ కీలక నేత అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్..

BCY Party : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఇంఛార్జి అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్ “భారత చైతన్య యువజన పార్టీ” లోకి చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బొడే రామ చంద్ర యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ ను పార్టీ లోకి ఆహ్వానించారు. సుమారు 1000 మంది అనుచరులు, నాయకులతో కలిసి ఆయన పార్టీ మారారు.

ఈ సందర్భంగా బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు కోసం, రైతుల కోసం ఒక సరికొత్త ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ పని చేస్తుందని తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏండ్లుగా రైతుల పరిస్థితి మారలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బిసి, ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ వారిని ఓటు బ్యాంక్ గా చూస్తున్నారని విమర్శించారు. అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆరెస్,కాంగ్రెస్ పార్టీలు మోసకారి పార్టీలని విమర్శించారు. బీసీవై పార్టీ ద్వారా రాబోయే కాలంలో రాష్ట్రంలో మంచి సుపరిపాలన తీసుకువస్తామని తెలిపారు.