Home /Author Chaitanya Gangineni
క్రికెట్ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్స్టార్ శుభవార్త చెప్పింది. త్వరలో జరగబోయే ఆసియా కప్, ఐసీసీ మెన్స్ ప్రపంచ కప్ మ్యాచ్లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా చూడొచ్చని ప్రకటించింది. అయితే, మొబైల్ లో చూసే వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ అందిస్టున్నట్టు తెలిపింది.
మాజీ ఎంపీ , బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం గురించి 3, 4 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు.
కోవిడ్ 19 చాలామందికి తేలికగా, త్వరగా నయం అయింది. అయితే కొంత మందిలో మాత్రం అది చాలా కాలం ఇబ్బంది పెట్టింది. వారాలు, నెలలు కూడా కొవిడ్ తో ఇబ్బంది పడిన బాధితులు ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటో అనేది చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నారు.
అసలే శుభకార్యాల సీజన్ నడుస్తోంది. సాధారణంగా పట్టు బట్టలన్నీ బయటికొస్తాయి. కట్టుకున్నపుడు గ్రాండ్ గా ఉన్నా ఏదైనా మరకలు పడితే మాత్రం వాటిని పోగొట్టేందుకు పెద్ద పనే ఉంటుంది. అలాగని ఎడాపెడా ఉతకడం కూడా చేయలేము. అందుకే పట్టు బట్టలు విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పడిన మరకలు పొగొట్టుకోవచ్చు. వాటిని భద్రంగా ఉంచుకోవచ్చు.
ఆస్ట్రేలియాతో జరుగతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నారు. ఓవర్ నైట్ స్కోరు 327/3 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మొదటి సెషన్ ముగిసే సమయానికి 422/7 తో కట్టడి చేయగలిగారు.
WTC Final 2023: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో గద పట్టేదెవరు? అదేంటీ విజేత ఎవరో తేలడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కదా. అయితే ఫైనల్ ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఆశ్రయించారు. మరి ఏఐ చెప్పిన సమాధానమేంటో ఆసీస్ ప్లేయర్లు వీడియో ద్వారా పంచుకున్నారు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ఎవరనేది మేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడిగాం. ఏఐ ఇచ్చిన ఆన్సర్ చాలా […]
హీరో నితిన్ ‘లై’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది చెన్నై చిన్నది మేఘా ఆకాశ్. ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు కు చెందిన ఓ పొలిటీషియన్ కుమారుడితో మేఘా కొంత కాలంగా ప్రేమలో ఉందనే టాక్ ఉన్నట్టు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తెలంగాణలో దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తోంది. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 20 రోజుల పాటు పలు కార్యక్రమాలకు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది.
భారత వాతావరణ శాఖ ‘చల్లని’ గుడ్ న్యూస్ చెప్పింది. ఎట్టకేలకు దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ తెలిపింది. కేరళ తీరాన్ని గురువారం నైరుతి రుతుపవనాలు తాకినట్టు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది.
దిగ్గజ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఎక్కువగా మహిళలే కంపెనీని వీడుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని టీసీఎస్ వెల్లడించింది. ఎంప్లాయిస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని తీసివేయడమే ఇందుకు కారణం కావచ్చని కంపెనీ అభిప్రాయ పడింది.