Tough Stains: పట్టు వస్త్రాలపై మరకలు.. ఈ చిట్కాలతో మాయం
అసలే శుభకార్యాల సీజన్ నడుస్తోంది. సాధారణంగా పట్టు బట్టలన్నీ బయటికొస్తాయి. కట్టుకున్నపుడు గ్రాండ్ గా ఉన్నా ఏదైనా మరకలు పడితే మాత్రం వాటిని పోగొట్టేందుకు పెద్ద పనే ఉంటుంది. అలాగని ఎడాపెడా ఉతకడం కూడా చేయలేము. అందుకే పట్టు బట్టలు విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పడిన మరకలు పొగొట్టుకోవచ్చు. వాటిని భద్రంగా ఉంచుకోవచ్చు.
Tough Stains: అసలే శుభకార్యాల సీజన్ నడుస్తోంది. సాధారణంగా పట్టు బట్టలన్నీ బయటికొస్తాయి. కట్టుకున్నపుడు గ్రాండ్ గా ఉన్నా ఏదైనా మరకలు పడితే మాత్రం వాటిని పోగొట్టేందుకు పెద్ద పనే ఉంటుంది. అలాగని ఎడాపెడా ఉతకడం కూడా చేయలేము. అందుకే పట్టు బట్టలు విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పడిన మరకలు పొగొట్టుకోవచ్చు. వాటిని భద్రంగా ఉంచుకోవచ్చు.
ఉతకడం లాంటివి వద్దు(Tough Stains)
పట్టుబట్టల్ని నీటిలో నానెబెట్టడం, వాషింగ్ మెషిన్ లో ఉతకడం లాంటివి చేయొద్దు. డ్రైక్లీనింగ్ కు ఇచ్చుకోవడం ఉత్తమం. నూనె మరకలు పడితే వాటిపై కాస్త పౌడర్ చల్లండి. పౌడర్ నూనెను పీల్చుకున్న తర్వాత చల్లటి నీటిలో ముంచిన దూదితో రుద్దితే సరిపోతుంది. ఇలా చేసిన మరక కనిపిస్తుంటే.. కొంచెం నీటిలో బేబీ షాంపూ కలిపి ఈ నీటిలో క్తాత్ తో లేదా దూదితో రుద్దితే ఫలితం ఉంటుంది.
కూరల లాంటి మరకలు పడి ఎండిపోతే అవి ఈజీగా పోవు. ముందు చల్లటి నీటిలో ముంచి పిండిన స్పాంజితో నెమ్మదిగా మరకలపై అద్దండి. మరక ఇంకా కనిపిస్తుంటే నీరు, వెనిగర్ ఈక్వల్ గా తీసుకోండి. దానిలో ముంచిన దూదితో అద్దండి. కానీ ఈ విధానం వల్ల కొన్ని చీరలు రంగుపోయే ప్రమాదముంది. అందుకే కట్టు చెంగు దగ్గర కొద్దిగా అద్ది 10 నిమిషాలు చూడండి. సమస్య లేదు అనుకున్న తర్వాత ప్రయత్నించండి. కొన్ని మొండి మరకలకు వెనిగర్ మిశ్రమం సరిపోదు. అలాంటప్పుడు గ్లాసు నీళ్లలో స్పూను డిష్ వాషింగ్ సొల్యూషన్‌ను కలిపి దాంతో రుద్ది చూడొచ్చు.
ఎండలో కాకుండా..
పట్టుబట్టలు విప్పేయగానే కుప్పగా పడేయొద్దు. ఇలా చేస్తే జరీ దెబ్బతింటుంది. మెటల్ కాకుండా తాడు లాంటి దానిపై ఆరేయాలి. కట్టిన ప్రతిసారీ డ్రైక్లీనింగ్‌కి ఇవ్వకుండా.. మూడు, నాలుగుసార్లు కట్టుకున్నాక ఇవ్వడం మేలు. అదే విధంగా నేరుగా ఎండ పడే చోటా పట్టు చీరల్ని ఆరేయక పోవడం మంచిది. దీని వల్ల రంగును కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే నీడలో ఆరబెట్టాలి. ఆపై రోలింగ్‌కి ఇచ్చి పేపర్ లేదా వస్త్రంలో ఉంచి భద్రపరిస్తే సరిపోతుంది. నేరుగా ఇస్త్రీ చేయడం కూడా మంచిది కాదు. పట్టు డ్రెస్సులపై ఏదైనా వస్త్రం వేసి, దాని మీద రుద్దాలి.
పట్టుబట్టలను అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. లేకుంటే ముడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది. పట్టు బట్టలను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా గాక కవరులో పెట్టి పెట్టుకోవాలి.