Home /Author anantharao b
పెగాసస్ స్నూప్‌గేట్ వివాదానికి సంబంధించి సాంకేతిక కమిటీ పరిశీలించిన 29 మొబైల్ పరికరాల్లో దేనిలోనూ రుజువు కనుగొనబడలేదని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం దీని పై పలు పిటిషన్లను విచారించింది.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేడు చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.
కరోనా సమయంలో భారత్‌కు వచ్చి ఆంక్షల వల్ల గత రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయిన విద్యార్థులు తమ విద్యాసంవత్సరాన్ని కొనసాగించవచ్చని చైనా తెలిపింది. వీరితోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు చైనాకు వచ్చేందుకు వీలుగా త్వరలో వీసాలు జారీ చేయనున్నామని చైనా ప్రకటించింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి బంగారు లాకెట్ల విక్రయాలు గత 2రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి రూపం, సుదర్శన నారసింహ యంత్రాన్ని లాకెట్ రూపంలో తయారు చేసి విక్రయించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దివ్యాంగులకు లక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇందుకు ఎనేబుల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. ఆర్థిక సేవలు, తయారీ, రిటైల్, టెక్ వంటి రంగాల్లోని 100 కంటే ఎక్కువ సంస్థలను ఒక చోట చేర్చడం కోసం ఇన్‌క్లూజన్ టు యాక్షన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశం పై చర్చించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపణలు రేపాయి. అయితే తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కవిత కోర్టుకెక్కారు.
ఆఫ్రికా దేశాలు కరువుతో విలవిల్లాడ్డం మనం చూస్తూనే ఉన్నాం. ఇపుడు యూరప్కూడా ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకొని విల్లవిల్లాడిపోతోంది. గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా యూరప్‌ను ఈ ఏడాది కరువు వెంటాడుతోంది.
అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు జైలు శిక్ష ఖరారైంది. లోయర్ కోర్టు తనకు విధించిన 12 ఏళ్ల శిక్షను రద్దు చేయాలంటూ నజీబ్ చేసిన విజ్ఞప్తిని మలేసియా ఫెడరల్ కోర్టు మంగళవారం తోసిపుచ్చింది.